ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో ఆరాధనోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-22T05:33:03+05:30

అలంపూర్‌ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వస్వామి, నవబ్రహ్మ ఆలయాలను అభివృద్ధికి ఆజన్మాంతం కృషి చేసిన గండ్రకోట కుమారస్వామిశాస్ర్తి ఆరాధనోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

గండ్రకోట కుమారస్వామి సమాధి వద్ద పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గండ్రకోట కుమారస్వామి సమాధికి ప్రత్యేక పూజలు

అలంపూరు, జనవరి 21 : అలంపూర్‌ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వస్వామి, నవబ్రహ్మ ఆలయాలను అభివృద్ధికి ఆజన్మాంతం కృషి చేసిన గండ్రకోట కుమారస్వామిశాస్ర్తి ఆరాధనోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయం ముందున్న  కుమారస్వామి జీవ సమాధికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  1916లో రాక్షస నామ సంవత్సరం, పుష్ప బహుళ తదియ నాడు కుమారస్వామిశాస్ర్తి సజీవ సమాధి అయ్యారని తెలిపారు. బాలబ్రహ్మాశ్వర స్వామిపై పాటలను రచించారని, కాశీ విశ్వేశ్వరుడి ప్రేరణతో ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఆయన ఊరూరు తిరిగి ధాన్యం సేకరించి భక్తులకు అన్న దానం చేశారని తెలిపారు. మొట్టమొదట పల్లె పాడు వెంకటధర్మారెడ్డి ఆర్థిక సహకారంతో ధర్మశాల పేరుతో అన్నదాన సత్రాన్ని ప్రారంభించారని చెప్పారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధర్మశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శేఖర్‌, ప్రదీప్‌, ఆలయ పూజారి కిట్టు స్వామి, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising