ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ

ABN, First Publish Date - 2022-10-05T03:58:11+05:30

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమే బతుకమ్మ పండుగ అని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు.

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణరావుపేట, అక్టోబరు 4: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమే బతుకమ్మ పండుగ అని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో బతుకమ్మతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో ప్రజలు తీరొక్క పూలతో బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంతో పాటు లక్ష్మిదేవిపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు. అనంతరం మూడు గ్రామాలకు ప్రధాన చెరువు అయిన పెద్దచెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

ఘనంగా సద్దుల బతుకమ్మ

సిద్దిపేట అర్బన్‌, అక్టోబరు 4: సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలో కొన్నేళ్ల నుంచి పదోరోజు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మంగళవారం గ్రామంలో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఆడేవారికి ఇబ్బందులు లేకుండా సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌ తగు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-10-05T03:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising