ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిషప్‌ సాల్మన్‌ రాజ్‌ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2022-10-19T04:56:19+05:30

మెదక్‌ చర్చి పాస్టరేట్‌ ఎన్నికలపై వివాదం కొనసాగుతున్నది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళవారం మెదక్‌లోని చర్చి ప్రాంగణంలో బిషప్‌, ప్రెసిబిటరీ ఇన్‌చార్జి దిష్టిబొమ్మలను గంట సంపత్‌ ప్యానల్‌ దహనం చేశారు.

బిషప్‌ సాల్మన్‌రాజ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న గంట సంపత్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాస్టరేట్‌ కమిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణ 

మెదక్‌ కల్చరల్‌, అక్టోబరు 18: మెదక్‌ చర్చి పాస్టరేట్‌ ఎన్నికలపై వివాదం కొనసాగుతున్నది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళవారం మెదక్‌లోని చర్చి ప్రాంగణంలో బిషప్‌, ప్రెసిబిటరీ ఇన్‌చార్జి దిష్టిబొమ్మలను గంట సంపత్‌ ప్యానల్‌ దహనం చేశారు. ఆఫీ్‌సబేరర్స్‌ కమిటీతో సహా 18 మంది సభ్యులకు ఎన్నికలు జరగగా సంపత్‌ ప్యానల్‌ సభ్యులు 11 మంది, రోలాండ్‌పాల్‌ ప్యానల్‌ సభ్యులు ఏడుగురు గెలుపొందారని తెలిపారు. బిష్‌పకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏడుగురు సభ్యులు మాత్రమే గెలుపొందిన ప్యానల్‌కు, 9 మంది నామినేటెడ్‌ సభ్యుల సహకారంతో అధికారం కట్టబెట్టారని విమర్శించారు. ఈ విషయంపై బిషప్‌ సాల్మన్‌రాజ్‌, ప్రెసిబిటరీ ఇన్‌చార్జి జార్జ్‌ ఏ బెంజర్‌రాజు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. మెజార్జీ సభ్యులను కాదని తక్కువ సీట్లు గెలుపొందిన వారిని పాలకవర్గ సభ్యులుగా గుర్తించడంపై చెన్నైలోని సినాడ్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

పాస్టరేట్‌ పరిపాలన కార్యవర్గం ఎన్నిక 

మెదక్‌ సీఎ్‌సఐ చర్చి పరిపాలన ఎన్నికలు చర్చి ఆవరణలో బిషప్‌ సమావేశ భవనంలో మంగళవారం జరిగాయి. అక్టోబరు 1న జరిగిన చర్చి ప్యానల్‌ ఎన్నికల్లో గెలిచిన సభ్యుల నుంచి పాస్టరేట్‌ పరిపాలన కోసం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పాస్టరేట్‌ సెక్రటరీగా సామ్సన్‌ సందీప్‌, ట్రెజరర్‌గా రోనాల్డ్‌పాల్‌, పాస్టరేట్‌ స్టువర్డ్‌గా సునీల్‌, చర్చి స్టువర్డ్‌గా సుమన్‌, ప్రాపర్టీ సెక్రటరీగా నోబుల్‌సన్‌, సండే స్కూల్‌ సెక్రటరీగా జెకబ్‌, యూత్‌ సెక్రటరీగా జోయల్‌, ఉమెన్స్‌ సెక్రటరీగా ఇందిరా ప్లారెన్స్‌, పూర్‌ఫండ్‌ సెక్రటరీగా కొమ్ము పవన్‌, ఇవాంజెలిసం సెక్రటరీగా అరుణకుమారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రెసిబిటరీ ఇన్‌చార్జి జార్జి ఏబెంజర్‌ రాజు తెలిపారు. 

Updated Date - 2022-10-19T04:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising