ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-11-20T23:21:06+05:30

చేర్యాల, నవంబరు 20: కొమురవెల్లి మల్లన్నకు భక్తులు ఆదివారం దండిగా మొక్కులు సమర్పించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, నవంబరు 20: కొమురవెల్లి మల్లన్నకు భక్తులు ఆదివారం దండిగా మొక్కులు సమర్పించుకున్నారు. స్వామివారి దర్శనార్థం పొరుగు జిల్లాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లంపాయసం తయారుచేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని బండారు, పట్టువస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. తమ కోరికలు ఈడేర్చమని గంగిరేగుచెట్టుకు ముడుపుకట్టారు. అలాగే ఎల్లమ్మతల్లికి భక్తి ప్రపత్తులతో బోనం నివేదించి కల్లు, బెల్లంపానకం సాకపెట్టి ఒడిబియ్యం, వస్త్రాలు సమర్పించారు. తమ పిల్లలను, పాడిపంటలను చల్లగా కాపాడమని వేడుకున్నారు. ఈవో బాలాజీశర్మ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

నాచగిరి క్షేత్రంలో భక్తుల సందడి

వర్గల్‌, నవంబరు 20: వర్గల్‌ మండల నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం ఆఖరి ఆదివారం కావడంతో భక్తులు క్షేత్రానికి అధికంగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణీ, హరిద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలో బారులుతీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలోని ఉప ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు ఆలయ మండపలంలో నాలుగు పర్యాయములు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఇందులో 250 మంది దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి 13 నిజాభిషేకాలు, 10 కల్యాణాలు, 20 ఇతరత్రా సేవలు నిర్వహించినట్లు సహాయ కమిషనర్‌, ఆలయ కార్య నిర్వహణ అధికారి కట్ట సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆలయ సిబ్బంది సుధాకర్‌, నరేందర్‌, పాండు, నరసింహ పర్యవేక్షణలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

========================================

Updated Date - 2022-11-20T23:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising