ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమగతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్షాదివస్‌

ABN, First Publish Date - 2022-11-29T23:28:11+05:30

గజ్వేల్‌, నవంబరు 29: తెలంగాణ ఉద్యమగతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్షాదివస్‌ అని మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

పలు మండలాల్లో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

గజ్వేల్‌, నవంబరు 29: తెలంగాణ ఉద్యమగతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్షాదివస్‌ అని మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి అన్నారు. నవంబరు 29 దీక్షాదివస్‌ సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రోగులకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డిలతో కలిసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, సర్పంచ్‌ చంద్రమోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: దీక్షాదివస్‌ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ.అన్వర్‌, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, కౌన్సిలర్లు నళినిదేవి, బోజు రమాదేవి, భాగ్యరెడ్డి, శంకర్‌రెడ్డి, అయూబ్‌ పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్‌: తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ నవంబరు 29న చేపట్టిన దీక్షాదివస్‌ తెలంగాణ చరిత్రను మార్చివేసిందని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో తెలంగాణ దీక్షాదివ్‌సను పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు నివాసం నుంచి పురవీధుల గుండా రంగంధాంపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ములుగు: తెలంగాణను సాధించిన దేవుడు కేసీఆర్‌ అని ఆత్మ కమిటీ డైరెక్టర్‌ కుంట కరుణాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ములుగు మండలం వంటిమామిడిలో దీక్షాదివ్‌సలో భాగంగా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఏనుగు బాపురెడ్డి, ఎంపీటీసీ నవ్యశ్రీ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షాదివస్‌ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీనివా్‌సగుప్తా పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T23:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising