ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు

ABN, First Publish Date - 2022-11-28T23:15:01+05:30

నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రూ. 50 కోట్లతో ఐదు భారీ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు.

బొల్లారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు/జిన్నారం, నవంబరు 28: నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రూ. 50 కోట్లతో ఐదు భారీ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డితో విద్యుత్‌ సౌధలో సమావేశమై సమస్యలపై చర్చించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఐదు సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు అంగీకరించారన్నారు. ఈ మేరకు డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డితో కలిసి సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసే ప్రాంతాలపై ప్రతిపాదనలు అందజేశామన్నారు. అమీన్‌పూర్‌ చక్రపురికాలనీ, భ్రమరాంభిక మల్లికార్జున ఆలయ గోశాల, పటాన్‌చెరు జీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌, సింఫనీ పార్కుకాలనీ, తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో పనులను ప్రారంభిస్తామన్నారు. కాగా పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో రూ.ఐదు కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పోరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌ శంకుస్థాపన చేశారు. అలాగే రెండు రోజులుగా పటాన్‌చెరు మైత్రీ స్టేడియంలో నిర్వహించిన జీఎంఆర్‌ క్రికెట్‌ టౌర్నమెంట్‌ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కేబీఎన్‌ యంగ్‌స్టార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతలకు ఎమ్మెల్యే రూ.1.75లక్షల ప్రైజ్‌మనీ, ట్రోఫీలను అందజేశారు. కాగా బొల్లారం మున్సిపాలిటీలో రూ.8.35 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, బీరప్ప, సతీష్‌, శైలజ, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T23:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising