ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనిఫాం అందేనా?

ABN, First Publish Date - 2022-07-27T05:20:46+05:30

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. రెండేళ్ల పాటు కరోనా కారణంగా పాఠశాలలు సక్రమంగా నడవలేదు. దీంతో రెండేళ్లుగా యూనిఫాం అందించని ప్రభుత్వం ఈసారి తొందరగానే సరఫరా చేస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. కానీ టెస్కో నుంచి వస్త్రం సరఫరా చేయడంలో అంతులేని ఆలస్యం జరిగింది.

ఎమ్మార్సీ కార్యాలయం నుంచి యూనిఫాం వస్త్రాలను మండలాలకు తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలవుతున్నా పాఠశాలలకు పంపిణీ కాని వైనం

 డ్రెస్సులు కుట్టడానికి కూలి గిట్టుబాటు కాదంటున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు 

 92,771 మంది విద్యార్థుల ఎదురుచూపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. రెండేళ్ల పాటు కరోనా కారణంగా పాఠశాలలు సక్రమంగా నడవలేదు. దీంతో రెండేళ్లుగా యూనిఫాం అందించని ప్రభుత్వం ఈసారి తొందరగానే సరఫరా చేస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. కానీ టెస్కో నుంచి వస్త్రం సరఫరా చేయడంలో అంతులేని ఆలస్యం జరిగింది. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తుంది. ఇంత వరకు పూర్తి స్థాయిలో వస్త్రాలు వచ్చింది లేదు.. విద్యార్థులకు యూనిఫాం కుట్టి ఇచ్చింది లేదు. విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఏటా విద్యా సంవత్సరం ముగిసే నాటికి యూనిఫాంలకు  అవసరమైన వస్త్రాన్ని టెస్కో నుంచి జిల్లాలకు పంపించాలి. కానీ ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాంల కోసం బట్టలు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. ఫలితంగా ఆలస్యంగానే అందించే అవకాశం కనిపిస్తుంది. ఈసారి యూనిఫాం కలర్‌ను కూడా మార్చారు. 


పంపిణీకాని యూనిఫాం వస్త్రం


విద్యార్థులకు యూనిఫాం అందించడంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. జిల్లాలోని మండలాల పరిధిలో 907 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 7 మండలాల పరిధిలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టెస్కో నుంచి యూనిఫాం వస్త్రం వచ్చింది. ఈ మండలాల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం వస్త్రం ఇప్పటి వరకు రాలేదు. మరో 4 మండలాల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు యూనిఫాం వస్త్రం రావల్సి ఉంది. అయితే 10 మండలాల విద్యార్థులకు మాత్రం 1 నుంచి 8వ తరగతి వరకు యూనిఫాం వస్త్రాన్ని సరఫరా చేశారు. 


పంద్రాగస్టుకైనా అందేనా?


ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ డ్రెస్‌లతోనే పాఠశాలకు వస్తున్నారు. కనీసం ఈ పంద్రాగస్టు వరకైనా యూనిఫాం అందుతుందా అంటే అదీ నమ్మశక్యంగా లేదు. మెదక్‌ జిల్లాలో అయితే 907 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 625 ప్రాథమిక, 136 ప్రాథమికోన్నత, 146 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు 92,771 మంది విద్యార్థులు చదువుతుండగా వీరందరూ యూనిఫాం కోసం ఎదరు చూస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందించాలి. అంటే 1,85,542 ఏకరూప దుస్తులు కుట్టించాలి. 


సమస్యగా మారిన కుట్టుకూలి


జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫాంల కోసం అధికారులు వస్త్రాలను పంపిణీ చేస్తారు. 1 నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలకు కొలతలు తీసుకుని కుట్టించి ఇచ్చే బాధ్యతను ఎస్‌ఎంసీలకు అప్పగించారు. 1 నుంచి 7వ తరగతి వరకు షర్ట్‌, నిక్కర్‌, 8వ తరగతి నుంచి షర్ట్‌, పాయింట్‌ బాలుర కోసం కుట్టించి ఇవ్వాలి. టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఒకజత కుట్టుకూలి రూ.50, ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాకపోవడంతో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల సభ్యులు ముందుకు రావడం లేదు. యూనిఫాంలను కుట్టేందుకు జిల్లాలో ముందుకు వచ్చే ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగిస్తామని ఆయా మండలాల విద్యాధికారులు చెబుతున్నారు. మరికొందరు రూ.50లకు షర్టు, పాయింట్‌ గిట్టుబాటు అవ్వడం లేదని తిరిగి ఇచ్చేస్తున్నారు. డ్రెస్‌కు రూ.200 నుంచి రూ.250 చెల్లించాలని ఎస్‌హెచ్‌జీ గ్రూపుల సభ్యులు కోరుతున్నారు. దీంతో పూర్తి స్థాయిలో యూనిఫాం తయారు కావడంలో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. 


 


Updated Date - 2022-07-27T05:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising