‘మన ఊరు-మనబడి’తో పాఠశాలలకు మహర్దశ
ABN, First Publish Date - 2022-11-12T23:29:26+05:30
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్/కల్హేర్, నవంబరు 12: మనఊరు-మనబడి పథకంతో పాఠశాలలకు మహర్దశ కలిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో రూ.90 లక్షలతో పాఠశాల భవన నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, కడ్పల్ సర్పంచ్ సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి, మాజీ సర్పంచ్ భూంరెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, కిష్టారెడ్డి పాల్గొన్నారు. కాగా నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అంతకుముందు మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల వార్డెన్‌గా నియమితులైన నసీంబేగం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రుబీనాబేగంనజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, నాయకులు సంగప్ప, వెంకటేశం, బాలయ్య పాల్గొన్నారు. సీతారాం తండాలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట నాయకులు రవీందర్‌నాయక్, రమేష్‌చౌహాన్, రాజు, శంకర్‌నాయక్ ఉన్నారు.
Updated Date - 2022-11-12T23:29:27+05:30 IST