ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సేవలు పల్లె ముంగిటకు

ABN, First Publish Date - 2022-12-09T00:03:41+05:30

పల్లెలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. నంగునూరు మండలం గట్లమల్యాలలో గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాడు దవాఖానకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ శ్రమదానంతో రోడ్డు వేయించారు

నేడు గ్రామంలోనే దవాఖానను ఏర్పాటు చేశాం

నంగునూరు, డిసెంబరు 8 : పల్లెలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. నంగునూరు మండలం గట్లమల్యాలలో గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నంగునూరు మండల వాగు అవతలి గ్రామ ప్రజలకు దవాఖానకు వెళ్లేందుకు శ్రమదానం చేసి రోడ్డు వేయించారని గుర్తుచేశారు. ఇప్పుడు మండల కేంద్రాల్లో ఉండాల్సిన దవాఖాననే గ్రామంలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక నుంచి ప్రతీ గ్రామంలో నైపుణ్యం గల డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ కాన్పులు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అన్ని రోగాలకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్‌సీడీ కిట్లను పంపిణీ చేస్తున్నామని క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. నంగునూరు నుంచి ఖాతా వరకూ డబుల్‌ లేన్‌ రోడ్డు వేసుకున్నామని గుర్తుచేశారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసుకొని కరెంటు సమస్య లేకుండా చేశామన్నారు. మండలంలోని పెద్దవాగుపైన 7 చెక్‌డ్యాములను నిర్మించడంతో నీటి ఊటలు పెరిగాయన్నారు.

కేంద్రం వడ్లు కొనకున్నా రైతులకు మద్దతు ధర కల్పించాం

రైతులు పండించిన పంటను కేంద్రంలో ఉన్న బీజేపీ కొనను అంటే రైతుల మేలుకోరే సీఎం కేసీఆర్‌ ప్రతీ గింజా కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తున్నారని తెలిపారు. ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి నంగునూరు పెద్ద వాగులో నింపుతామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దవాగు నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువుల్లోకి నీళ్లు మళ్లించి నీటి ఊటలు పెంచనున్నట్లు వివరించారు. గతంలో అప్పుల బాధతో రైతులు అనేకమంది ఆత్మహత్య చేసుకునే వారని తెలంగాణ వచ్చాక రైతుబంధు పథకంతో అన్నదాతల ముఖాల్లో వెలుగులు చూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంకును, సామూహిక గొర్రెలషెడ్‌ను ప్రారంభించారు. షెడ్లలో లబ్ధిదారులకు సంప్రదాయ దుస్తులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌ తిప్పని రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌, రాష్ట్ర ఆయిల్‌పామ్‌ రైతు వెల్ఫేర్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక నాయకులు, వైస్‌ ఎంపీపీ కర్ణకంటి రేణుకవేణుగోపాల్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

9 నెలల్లో మహిళా సమైక్య భవన నిర్మాణం పూర్తి

సిద్దిపేట అర్బన్‌ : 9 నెలల్లోనే మహిళా భవనం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎల్లుపల్లి, మిట్టపల్లి సమీపంలో మహిళా సమైక్య భవనం, మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమ నిర్మాణానికి గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళా భవనం సంగారెడ్డిలో ఉండేదని ప్రతీ పనికి అక్కడికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తచేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట జిల్లా ఏర్పడడంతో కష్టాలు తప్పయన్నారు. మహిళా భవనానికి సమీపంలోనే రైల్వేస్టేషన్‌, ఎస్సీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల కూడా వస్తుందని తెలిపారు. మహిళలు ముఖ్యంగా ప్రసవాల విషయంలో తొందరపడొద్దని నార్మల్‌ డెలివరీకి వేచిచూడాలని మంత్రి సూచించారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని గుర్తుచేశారు. ఒంటరి మహిళలకు పింఛన్‌ ఇస్తున్నామని గుర్తుచేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 499 గ్రామాల్లో మహిళా భవనాలను నిర్మించామని, ఇంకేమైనా ఉంటే ఎంక్వయిరీ చేసి లిస్ట్‌ ఇస్తే వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇతర దేశాలతో పోటీ పడుతూ రుతుప్రేమ కార్యక్రమాన్ని సిద్దిపేటలో ప్రారంభించామని వెల్లడించారు.

పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాం

ఇల్లు కట్టాలన్న పేదవారి కలను నెరవేరుస్తూ అన్ని సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో 40 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క రూపాయి అప్పు లేకుండా పేదవారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లును నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు. త్వరలోనే మిట్టపల్లికి మరిన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ఆధునికంగా ఉండేలా రూ.రెండు కోట్లతో ఫంక్షన్‌హాల్‌ నిర్మిస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కృషి చేసిన ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ లక్ష్మిని మంత్రి అభినందించారు. అనంతరం డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, డీపీవో దేవికీదేవి, డీఆర్‌డీవో గోపాల్‌రావు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, మిట్టపల్లి సర్పంచ్‌ లక్ష్మి, ఎల్లుపల్లి సర్పంచ్‌ జయశ్రీరమేష్‌, తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వాతి, ఎన్‌ఆర్‌జీఎ్‌స స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బాల్‌రంగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T00:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising