ఎంపీని సవాల్ చేసే స్థాయి కాదు
ABN, First Publish Date - 2022-12-27T23:32:15+05:30
దుబ్బాక, డిసెంబరు 27: ఎంపీగా పోటీచేసి, డిపాజిట్ కూడా దక్కించుకోలేని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అప్రతిహతంగా విజయమే హారంగా వేసుకుని లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరేంత స్థాయి, సీన్‌లేదని బీఆర్‌ఎస్ దుబ్బాక మండల నాయకులు మండిపడ్డారు.
ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై దుబ్బాక బీఆర్‌ఎస్ నేతల మండిపాటు
దుబ్బాక, డిసెంబరు 27: ఎంపీగా పోటీచేసి, డిపాజిట్ కూడా దక్కించుకోలేని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అప్రతిహతంగా విజయమే హారంగా వేసుకుని లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరేంత స్థాయి, సీన్‌లేదని బీఆర్‌ఎస్ దుబ్బాక మండల నాయకులు మండిపడ్డారు. మంగళవారం బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణగౌడ్, బీఆర్‌ఎస్ అక్బర్‌పేట-భూంపల్లి మండలాధ్యక్షుడు జీడిపల్లఇ రవి, కౌన్సిలర్లు ఇల్లెందుల శ్రీనివాస్, ఆస యాదగిరి, బంగారయ్య, ఆసస్వామి, దుబ్బాక బాలకిషన్, బత్తుల స్వామి, నాయకులు పల్లె రామస్వామిగౌడ్, బీమసేనలు మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క పైసా నిధులు సాధించలేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తెస్తామని చెప్పి, సడన్ స్టార్‌గా గెలిచిన రఘునందన్‌రావు, ఎంపీగా రెండు పర్యాయాలు నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిన ప్రభాకర్‌రెడ్డిని విమర్శించే స్థాయిలేదన్నారు. దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్‌గా కూడా తిరిగి గెలువలేని రఘునందన్‌రావు, ప్రజా సేవకుడు ఎంపీ మీద విమర్శిస్తే సహించేది లేదన్నారు. పటాన్‌చెరువు జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే, దుబ్బాకలో వచ్చిపడి, బీఆర్‌ఎస్ పార్టీ పేరు చెప్పి దందాలు చేస్తే మెడలు పట్టి గెంటేయబడిన రఘునందన్‌రావుకు, తన సొంత డబ్బులతో తెలంగాణ ఉద్యమానికి ఇతోధిక సహాయం చేసి, వెన్నంటే నిలబడిన ప్రభాకర్‌రెడ్డికి పొంతనలేదని మండిపడ్డారు.
Updated Date - 2022-12-27T23:32:16+05:30 IST