ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం కోసం సిద్ధమవుతున్న మొక్కలు

ABN, First Publish Date - 2022-06-10T05:03:44+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కోసం మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.

నాగులబండ ఫారె్‌స్టలో మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, జూన్‌ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కోసం మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది. కొండపాక మండలం మర్పడగ శివారులోని నాగులబండ కాన్సెన్వరీ నర్సరీలో మొక్కలు పురుడు పోసుకుంటున్నాయి. వర్షాకాలంలో మొక్కలను అందించేందుకు నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. హరితహారం కింద సిద్దిపేట జిల్లాలో కొన్నేళ్ల నుంచి నాటుతున్న మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఒక నాగులబండ నర్సరీలోనే వచ్చే హరితహారం కోసం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం కోసం 8 లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సరీల్లో ఔషధ మొక్కలు, వేప, రావి, గుల్‌, పెల్లోఫామ్‌ చైనా బాదం, ఎగిసా, మర్రి, జువ్వి, మేడి, పెద్దఏగు, తెల్లమద్ది, తాని, బట్టగనప, ఆడవి మామిడి తదితర మొక్కలను పెంచుతున్నారు. కొన్ని నర్సరీల్లో పెరిగే మొక్కలు ఎండిపోకుండా ఎండ తెరలను ఏర్పాటు చేశారు. నాగులబండ నర్సరీలో రెండు, మూడు ఫీట్ల ఎత్తు పెంచిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2022-06-10T05:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising