ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన ఊరు-మన బడి’ పనులు నెలాఖరులోగా పూర్తవ్వాలి

ABN, First Publish Date - 2022-12-08T23:54:48+05:30

మనఊరు-మనబడి పథకంలో భాగంగా చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలని, పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి సబితాఇంద్రారెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 8 : మనఊరు-మనబడి పథకంలో భాగంగా చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలని, పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మన ఊరు-మన బడి పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్ని పనులు ఉన్నా కూడా ‘మన ఊరు-మన బడి’ పనులపై సమావేశాలు నిర్వహించి సక్సెస్‌ చేసిన కలెక్టర్లను ఆమె అభినందించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్‌ ఒక్కొక్కరుగా ప్రతి పాఠశాలలో జరుగుతున్న పనులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పర్యవేక్షించి వాటిని పూర్తి చేయించాలని ఆమె పేర్కొన్నారు. చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. మార్చి వరకు మొత్తం పాఠశాలల పనులు పూర్తిచేసేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలల్లో కొత్తగా లైబ్రరీ రూం ఏర్పాటు చేసి అందులో పిల్లలకు ఉపయోగపడే 200 రకాల పుస్తకాలను ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 40 శాతం పాఠశాలల్లో పనులు పూర్తికావొచ్చని, డిసెంబరు చివరి నాటి వరకు ప్రారంభానికి సిద్ధం చేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో శ్రీనివాస్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ శ్రీనివాస్‌, మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు.

పనులను వేగంగా పూర్తిచేయాలి

దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన మనఊరు-మన బడి పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో, ఎస్‌ఎంసీ చైర్మన్లు, ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈలు, సర్పంచ్‌, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఎలాంటి సదుపాయాలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడానికి తీసుకొచ్చిన గొప్ప పథకం మన ఊరు - మన బడి అని అన్నారు. సిద్దిపేట జిల్లా మొత్తంలో దుబ్బాక నియోజకవర్గంలో మనఊరు-మన బడి పథకం పనులు సరిగ్గా లేనందున కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈజీఎస్‌ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్‌ నిర్మాణం పూర్తి చేశాకే మిగతా ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజువారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్‌ పనులను పర్యవేక్షించాలన్నారు. మరోవిడత సమావేశంలోపు దాదాపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు మల్లన్న కల్యాణ ఆహ్వానపత్రిక

చేర్యాల : ఈనెల 18న కొమురవెల్లిలో జరగనున్న మల్లన్న కల్యాణానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి గురువారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అడ్మిన్‌ డీసీపీ మహేందర్‌కి ఆహ్వాన పత్రికలను అందించారు. అలాగే డివిజన్‌స్థాయి అధికారులకు కూడా ఆహ్వానపత్రికలను అందజేశారు. వారి వెంట ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, స్థానాచార్యుడు పడిగన్నగారి మల్లయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-08T23:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising