ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలి

ABN, First Publish Date - 2022-10-31T23:49:13+05:30

మిరుదొడ్డి, అక్టోబరు 31: సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలని, ఎవరైనా ఇతర కులాల పట్ల చిన్నచూపు చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని మిరుదొడ్డి డిప్యూటీ తహసీల్దార్‌ వీరయ్య హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డి, అక్టోబరు 31: సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలని, ఎవరైనా ఇతర కులాల పట్ల చిన్నచూపు చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని మిరుదొడ్డి డిప్యూటీ తహసీల్దార్‌ వీరయ్య హెచ్చరించారు. సోమవారం మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలోని అంటరానితనం, కులవివక్షపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శంకర్‌, ఏ ఎస్‌ఐ మధు, ఏర్‌ఐ రాజ్‌కుమార్‌, ఎంపీటీసీ లలిత పాల్గొన్నారు.

తొగుట: పౌరుల హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తొగుట మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌ హెచ్చరించారు. సోమవారం తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ లీలాదేవి వెంకటేశం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గణేష్‌ పాల్గొన్నారు.

చేర్యాల: చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సర్పంచ్‌ కొండపాక భిక్షపతి, ఆర్‌ఐ రాజేందర్‌రెడ్డి, ఏఎ్‌సఐ నవీన్‌ మాట్లాడారు.

నారాయణరావుపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్‌ ఉమారాణి సూచించారు. సోమవారం నారాయణరావుపేట మండలం గోపులాపూర్‌ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు.

కొండపాక: కొండపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ ఇందిరాదేవి, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామింగ్‌ అధికారి అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌ టౌన్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ నల్ల రాంచంద్రారెడ్డి వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డీ.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్ద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ గొపని లక్ష్మి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాలయ్య ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్ర ఎల్లం, పంచాయతీ కార్యదర్శి ప్రభాకార్‌ పాల్గొన్నారు.

గజ్వేల్‌: భారతదేశంలో 562 సంస్థానాలను విలీనం చేసిన గొప్పమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల కమిటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌ అన్నారు. గజ్వేల్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు 2కే రన్‌ నిర్వహించారు. ఈ రన్‌ను గజ్వేల్‌ సీఐ వీరప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. గజ్వేల్‌లోని బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు.

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని దివంగత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Updated Date - 2022-10-31T23:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising