సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం

ABN, First Publish Date - 2022-06-05T17:28:21+05:30

ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశఆరు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది.

సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాస్‌ మృతి చెందారు. మెండు శ్రీనివాస్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక తరపున టీఆర్ఎస్ పార్టీ సహా... సీఎంవో బీట్ రిపోర్టర్‌గా శ్రీనివాస్‌ సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మెండు శ్రీనివాస్ అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెండు శ్రీనివాస్ మృతికి మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2022-06-05T17:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising