ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor vs TS Govt: గవర్నర్‌పై మంత్రి సబిత ఫైర్

ABN, First Publish Date - 2022-11-09T20:10:17+05:30

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అపాయింట్‌మెంట్ ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారని మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అపాయింట్‌మెంట్ ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారని మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మండిపడ్డారు. ఈ రోజు ఉదయం 11 నుంచి గవర్నర్ అపాయింట్‌మెంట్ (Appointment) కోసం ప్రయత్నించామని, రాజ్‌భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తోచిపుచ్చారు. బుధవారం సబిత మీడియాతో మాట్లాడుతూ సమయం ఇస్తే గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని భావించామని, గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారని తప్పుబట్టారు. తనకు అవగాహన లేదని గవర్నర్ అన్నట్లు తెలిసిందని, అవగాహన లేకపోతే అడిగి తెలుసుకుంటానని చెప్పారు. త్వరలో పూర్తి సమాచారంతో మీడియాతో మాట్లాడుతానని సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.

యూనివర్సిటీ (University)ల చట్ట సవరణ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి.. రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్‌ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు. నిజానికి, ఆ లేఖను తొలుత విద్యా శాఖకు రాశారని ప్రచారం జరిగింది.

Updated Date - 2022-11-09T20:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising