ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి గారూ..వాగుపై వంతెన మంజూరేదీ!

ABN, First Publish Date - 2022-12-11T23:46:07+05:30

నల్లగొండ - యా దాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుగా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు - పొడిచేడు గ్రామా ల మధ్య గల మూసీ వాగుపై హైలెవెల్‌ వంతెన ను నిర్మిస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి ఇచ్చిన హామీ దాదాపు రెండేళ్లయినా కార్యాచరణకు నోచుకోలేదు.

కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి జగదీశరెడ్డి, ఎమ్మెల్యేలు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి గారూ..వాగుపై వంతెన మంజూరేదీ!

రెండేళ్లుగా ప్రజల ఎదురుచూపులు

భాగ్యనగరంలో భారీ వర్షాలతో లో లెవెల్‌ బ్రిడ్జీకి ముప్పే?

నార్కట్‌పల్లి, డిసెంబరు 11: నల్లగొండ - యా దాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుగా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు - పొడిచేడు గ్రామా ల మధ్య గల మూసీ వాగుపై హైలెవెల్‌ వంతెన ను నిర్మిస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి ఇచ్చిన హామీ దాదాపు రెండేళ్లయినా కార్యాచరణకు నోచుకోలేదు. 2020 అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు ఎగువన హైదరాబాద్‌ నుంచి వచ్చిన వరద ఉప్పెనకు వాగుపై ఉన్న లోలెవెల్‌ వంతెన దెబ్బతినడంతో పాటు బీటీ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. దీంతో ఈ బ్రిడ్జి మీదుగా మోత్కూరు ఆపై గ్రామాల రాకపోకలకు కొన్ని రోజుల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంతెన పైనుంచి ప్రవహించిన వరద ఽధాటికి వంతెనకు రెండువైపులా ఉన్న రక్షణ గోడ లు కొన్నిచోట్ల దెబ్బతిని ప్రమాదకరంగా మారా యి. వరద ఉధృతికి దెబ్బతిన్న వంతెన, కొట్టుకుపోయిన బీటీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డిలతో పాటు సంబంధిత ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో హుటాహుటిన మంత్రి గుంతకండ్ల జగదీ్‌షరెడ్డి సందర్శించారు. వంతెనను ఆసాంతం స్వయంగా కాలినడకన పరిశీలించారు. మూసీ ప్రవాహ ఉగ్రరూపంతో వంతెనకి అనుసంధానంగా ఉన్న బీటీ రోడ్డు సుమారు 184 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయి సుమారు రూ.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆర్‌అండ్‌బీ అధికారులు అప్పట్లో అంచనా వేసి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి జగదీ్‌షరెడ్డి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా లోవెవెల్‌గా ఉన్న ఈ వం తెన స్థానంలో హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మిస్తామని హా మీ ఇచ్చారు. ఈమేరకు అంచనాలను రూపొందించాల్సిందిగా ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆ దేశించారు. కేసీఆర్‌ను కలిసి హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని కూడా చెప్పారు.

అప్రోచ రోడ్‌తో సరి....

వరద ధాటికి కొట్టుకుపోయిన బీటీ రోడ్డు స్థా నంలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో ఇదే లో లెవెల్‌ వంతెనకు అనుసంధానంగా అప్రోచ రోడ్‌ పనులతోనే సరిపెట్టారు. హైలెవెల్‌ వంతెన ఏర్పా టు చేయకుంటే భవిష్యత్తులో భాగ్యనగరంలో భా రీ వర్షాలు కురిస్తే ఆ వరద నీటితో వాగుపై ఉన్న లో లెవెల్‌ వంతెనకు ముప్పేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-11T23:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising