ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Reddy : పైలట్‌కు ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-12-29T03:16:48+05:30

పైలట్‌ రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ఈడీ దర్యాప్తును అడ్డుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నో

సమన్లపై జోక్యానికీ నిరాకరణ

ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలే ఈడీకి

ఇవ్వండి.. రోహిత్‌కు ధర్మాసనం స్పష్టం

జనవరి 5కు విచారణ వాయిదా

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ఈడీ దర్యాప్తును అడ్డుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రోహిత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పరిధిలోకి రాదని, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాని(పీఎల్‌ఎంఏ)కి భిన్నంగా ఈడీ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈడీ అనేది పంజరంలో చిలక. రాజకీయ దురుద్దేశంలో భాగంగానే ఈడీ ఈ కేసును నమోదు చేసింది. ఈడీ జోక్యం చేసుకునేంతలా మనీలాండరింగ్‌ కోణంలో ఎలాంటి లావాదేవీలు చోటుచేసుకోలేదు. పీఎల్‌ఎంఏ సెక్షన్లను తప్పుగా ఉపయోగిస్తూ.. నా క్లైంట్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు నిందితులు రెండు దఫాలుగా రూ. 100 కోట్లను చెల్లిస్తామని ఆఫర్‌ చేశారే తప్ప.. ఎలాంటి లావాదేవీలు జరగలేదని గుర్తుచేశారు. తన క్లైంట్‌ ఫిర్యాదు మేరకు చర్చలు జరుగుతున్న సమయంలోనే పోలీసులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని చెప్పారు.

‘‘పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 2(1)(యూ) కింద ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఇందులో ప్రొసీడ్స్‌ ఆఫ్‌ క్రైం ఏమీ లేదు. జరిగిన నేరానికి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా ప్రాపర్టీని క్రిమినల్‌ యాక్టివిటీలో భాగంగా తీసుకున్నప్పుడు మాత్రమే పీఎంఎల్‌ఏ ప్రకారం ప్రొసీడ్స్‌ ఆఫ్‌ క్రైం వర్తిస్తుంది. ఇక్కడ అలాంటి లావాదేవీలు ఏమీ జరగలేదు’’ అని ఆయన వివరించారు. తన క్లైంట్‌ను ఈ నెల 30న మరోమారు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారని, ఇప్పటికే రోహిత్‌రెడ్డి రెండు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని తెలిపారు. రోహిత్‌రెడ్డితోపాటు.. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆదాయ మార్గాలు(ఇన్‌కం సోర్స్‌), ఆధార్‌, పాన్‌ వంటి వివరాలను అడుగుతున్నారని వివరించారు. పిటిషనర్‌ను అక్రమంగా ఇరికించే ఉద్దేశంతో సాగుతున్న దర్యాప్తును అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుని, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు ప్రజాప్రతినిధి కాదా? ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు అన్నీ ఇచ్చారు కదా? అవే వివరాలు ఈడీకి ఇవ్వడానికి అభ్యంతరమేమిటి?’’ అని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది నిరంజన్‌రెడ్డి సమాధానం ఇస్తూ.. ఇది సమాచారం ఇవ్వడానికి సంబంధించిన సమస్య కాదని.. అసలు ఈడీకి దర్యాప్తు పరిధి లేదనేది ప్రధానమైన అంశమని పేర్కొన్నారు.

ఈడీ దర్యాప్తును అడ్డుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి వచ్చి వాదనలు వినిపిస్తారని.. అప్పటివరకు సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌ను మీరు అడిగిన సమాచారం పూర్తిగా వచ్చిందా? అని ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. రాలేదని ఈడీ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీచేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. ఈడీ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. 30వ తేదీన హాజరుకావాలన్న ఈడీ సమన్ల విషయంలో సైతం జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది.

Updated Date - 2022-12-29T03:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising