YS Sharmila: నా పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుంది
ABN, First Publish Date - 2022-12-04T16:06:36+05:30
Hyderabad: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుందని అన్నారు. ఇటీవల తన పాదయాత్రను అడ్డుకోవడంపై
Hyderabad: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుందని అన్నారు. ఇటీవల తన పాదయాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల..ఇప్పటికే దాదాపు మూడుసార్లు తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇస్తే కూడా పోలీసులు అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. తనకు వస్తున్న జనాదరణ చూసి .. కేసీఆర్ ఓర్వలేక పోలీసుల ద్వారా తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, అసలు పోలీసులు ప్రజల కోసం కాకుండా కేసీఆర్, ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘మహిళా అనే గౌరవం ఇవ్వకుండా నన్ను మరదలు అంటూ సంబోధించడం తప్పు కాదా? నన్ను అగౌరవపరిచినందుకే నేను చెప్పుతో కొడతాను అన్నాను. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అవినీతి ,అక్రమాలు జరిగాయి. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే మీమీ నియోజకవర్గల్లో పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి. నేను రెడీ. తెలంగాణ సమాజం తరుపున షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సింది కేసీఆర్‌కు. అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు ఆయనకు ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2022-12-04T16:06:38+05:30 IST