తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 13 పాము పిల్లలు
ABN, First Publish Date - 2022-05-18T05:42:40+05:30
నేరేడుచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పాము పిల్లల సంచారం మంగళవారం కలకలం రేపింది. కార్యాలయం ఆవరణలో చెట్లు, పరిసరాల్లో పొలాలు, పొదలు ఉండడంతో పాము పిల్లలు కుప్పలుగా కన్పించాయి.
నేరేడుచర్ల, మే 17: నేరేడుచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పాము పిల్లల సంచారం మంగళవారం కలకలం రేపింది. కార్యాలయం ఆవరణలో చెట్లు, పరిసరాల్లో పొలాలు, పొదలు ఉండడంతో పాము పిల్లలు కుప్పలుగా కన్పించాయి. స్థానికులు వాటిని పింజర పిల్లలుగా గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్దకు ఒకేసారి రావడంతో కార్యాలయానికి వచ్చిన సందర్శకులు భయపడ్డారు. వెంటనే కొందరు వాటిని చంపివేశారు. మొత్తం 13పింజరు పిల్లలు ఉన్నాయి. పరిసరాల్లో ఇంకా పాములు ఉండవచ్చని, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-05-18T05:42:40+05:30 IST