ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనాలతో బెంబేలు

ABN, First Publish Date - 2022-12-20T23:22:22+05:30

జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల చోరీలు మరింతగా పెరిగిపోయాయి. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లి..

ఇటీవల చోరీ జరిగిన మునగాలలో పోలీస్‌స్టేషన సమీపంలోని భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నెలల్లో 20 చోరీలు

రూ.60 లక్షల సొత్తు అపహరణ

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే

కరువైన పోలీస్‌ నిఘా

సూర్యాపేట క్రైం, డిసెంబరు 20 : జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల చోరీలు మరింతగా పెరిగిపోయాయి. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లి.. వచ్చే లోపు చోరీ జరిగిపోతోంది. వీటికి తోడు చైనస్నాచింగ్‌(నడుచుకుంటూ వెళ్తున్న వారి మెడలో ఆభరణాలు దొంగిలించే) ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే ఆయా సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా చోరీ కేసులను ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

గడిచిన రెండు నెలల్లో జిల్లావ్యాప్తంగా 20 చోరీలు జరిగాయి. సుమారు రూ.60లక్షల మేర సొమ్ము అపహరణకు గురైంది. ఇటీవల కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌ వంటి పట్టణాలతో పాటు పెనపహాడ్‌, మేళ్లచెర్వు, చివ్వెంల, తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల పరిధిలో ఇటీవల చోరీలు జరిగాయి. లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కొంతనగదు అపహరణకు గురైంది. ఆయా దొంగలను కూడా పోలీసులు నేటికీ పట్టుకోలేదు. తాజాగా చివ్వెంల మండలం తిమ్మాపురంలో రూ.5లక్షలను చోరీచేశారు. ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉండగా డబ్బు మాత్రం అపహరణకు గురైంది. అదే నెల 29వ తేదీన మేళ్లచెర్వు మండలం రామాపురంలో నాలుగు నివాసాల్లో చోరీలకు పాల్పడి సుమారు 26తులాల ఆభరణాలు, రూ.1.20లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు అక్టోబరు 31న చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు కనకాలరెడ్డి నివాసంలో రూ.7.50లక్షల నగదు, 13తులాల ఆభరణాలు అపహరించారు. చోరీలు జరిగినపుడు పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల చోరీలకు సంబంధించి బాధితుల ఫిర్యాదులకు స్పందించడం లేదు. అంతేకాక కేసు కూడా నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో బాధితులను వివిధ రకాల ప్రశ్నలు వేసి ఫిర్యాదు చేయకుండా చేస్తున్నట్లు పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి.

జిల్లా కేంద్రంలోనూ

జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగి సుమారు ఆరు తులాల బం గారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. శ్రీశ్రీనగర్‌ కాలనీ, కృష్ణానగర్‌ కాలనీలోని మూడు నివాసాల్లో ఒకే రోజు దొంగలు చోరీలకు పాల్పడ్డారు. వీటితో పాటు శ్రీరాంనగర్‌ కాలనీ, విద్యానగర్‌లో కూడా తాళం వేసి ఉన్న నివాసాల్లో చోరీలు జరిగాయి. అక్టోబరు 28న హైటెక్‌ కాలనీలో ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు సుమారు 17తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నవంబరు 1న కుడకుడలోని హెడ్‌కానిస్టేబుల్‌ సైదులు ఇంట్లో రూ.10 వేల నగదు,80తులాల వెండి చోరీ చేశారు.

ఇంటికి తాళం వేయాలంటేనే..

ప్రజలు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా పనినిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇతర ప్రాంతానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేలోపు ఇళ్లల్లో చోరీ జరుగుతోంది. వరుస దొంగతనాలకు భయపడి కొంతమంది ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకుంటున్నారు.

పోలీసు నిఘా కరువు

దొంగతనాలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ఉదయం, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ చేయాల్సి ఉండగా వివిధ రకాల విధులు, సిబ్బంది కొరత కారణంగా పోలీసులు పెట్రోలింగ్‌ సరిగా చేయడం లేదు. పోలీసు అధికారులు కూడా శాంతిభద్రతల పరిరక్షణపై పెద్దగా శ్రద్ధచూపడం లేదన్న ఆరోపణలుఉన్నాయి. పలువురు పోలీస్‌ అధికారులు తక్కువ సమయం కేటాయిస్తూ సొంత పనులకు సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పని చేయడంలేదు. మరమ్మతుకు గురైతే వాటిని పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పని చేస్తే నేరాల చేధన చాలా సులభమయ్యేది. కానీ, పోలీస్‌ అధికారులు మాత్రం ఈ విషయంలో పట్టింపుల్లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.

పోలీ్‌సస్టేషనకు కూతవేటు దూరంలో

మునగాల మండల కేంద్రంలో నవంబరు 27వ తేదీ రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానిక పోలీ్‌సస్టేషనకు కూతవేటు దూరంలోనే ఈ ఇల్లు ఉండటం గమనార్హం కాగా ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల సొత్తు చోరీకి గురైంది. ఇంటి యజమాని వాసా శ్రీనివాసరావు, కళావతి దంపతులు ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె ధనలక్ష్మి ఇంటికి వెళ్లారు. వారు వెళ్లిన రెండో రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని సీసీ కెమెరాల హార్డ్‌డి్‌స్కలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా దొంగలను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

దొంగలను పట్టుకుంటాం

జిల్లాలో చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానిత వ్యక్తులు సంచరించినపుడు విధిగా పోలీసులకు సమాచారమివ్వాలి. జిల్లాలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పని చేసేటట్లు చర్యలు తీసుకుంటాం. దొంగతనాలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చోరీకి గురైన సొమ్మును తిరిగి రాబడతాం.

- రాజేంద్రప్రసాద్‌, ఎస్పీ

Updated Date - 2022-12-20T23:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising