ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్‌

ABN, First Publish Date - 2022-10-26T00:34:19+05:30

ప్రస్తుతం నిర్వహించబోయే మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఎవరి దృష్టికి వచ్చినా, మీచేతిలోని సెల్‌ఫోన్‌ ద్వారా చర్యలు తీసుకునే విధంగా చేయవచ్చు.

‘సీ-విజిల్‌’ యాప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిబంధనలు ఉల్లంఘించే వారికి హడల్‌

100 నిమిషాల్లో సమస్యకు పరిష్కారం

నల్లగొండ, అక్టోబరు 25: ప్రస్తుతం నిర్వహించబోయే మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఎవరి దృష్టికి వచ్చినా, మీచేతిలోని సెల్‌ఫోన్‌ ద్వారా చర్యలు తీసుకునే విధంగా చేయవచ్చు. దానికి పౌరులు చేయాల్సిందల్లా ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ‘సీ-విజిల్‌’ అనే యాప్‌ని మీ మొబైల్‌లోని గూగుల్‌ప్లే స్టోర్‌ ద్వారా మీ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. ఇందులో ఉల్లంఘనకు సంబంధించిన ఫొటో ఒకటితీసి దానిని యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్‌ ద్వారా ఎవరైన డబ్బు ఆశ చూపించినా, ప్రలోభాలకు గురిచేసినా, మద్యం సరఫరా చేసినా, నేరపూరిత చర్యలతో భయబ్రాంతులకు గురి చేసినా, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రవాణా చేసినా, లెక్కకు మించి ఖర్చు చేసినా, మత పరమైన ప్రసంగాలు చేసినా, నకిలీ వార్తలను తెలియజేసినా ఫిర్యాదు చేయవచ్చు. తాజాగా తీసిన ఫొటోలు, వీడియోల ద్వారా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోగల మానిటరింగ్‌ సెల్‌కు తెలుస్తుంది. తదుపరి 5 నిమిషాల్లోపు క్షేత్ర పరిశీలన అధికారి అయిన ఎంసీసీ, ఎఫ్‌ఎ్‌సటీ విచారణ నిమిత్తం పంపుతారు. 15 నిమిషాల్లో ఫిర్యాదుల్లో తెలిపిన స్థలానికి చేరుకుని క్షేత్ర విచారణచేసి 30 నిమిషాల్లో యాప్‌లో తమ నివేదికను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి పంపుతారు. రిటర్నింగ్‌ అధికారి 50 నిమిషాల్లో నివేదికను పరిశీలించి ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటారు. లేదంటే ఆ ఫిర్యాదును మూసివేస్తారు. ఒకవేళ రిటర్నింగ్‌ అధికారి పరిధి కాకపోతే తదుపరి చర్య నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారికి పంపుతారు. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదుదారునికి 100 నిమిషాల్లో తీసుకునే చర్యలను వివరిస్తారు. ఈ విషయమంతా మొబైల్‌ నెంబరు ద్వారా ఫిర్యాదుదారునికి తెలుస్తుంది.

ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ నెం:1950

ఎన్నికల సంఘం పౌరులందరికీ టోల్‌ఫ్రీ నెంబరు 1950ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్‌ఫ్రీ నెంబరుకు డయల్‌చేసి పౌరులు/ఓటర్లు ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఉదాహరణకు ఓటింగ్‌ తేదీలు, ఎపిక్‌కార్డ్‌లకు సంబంధించిన సమాచారం, ఓటర్‌ జాబితాకు చెందిన సమాచారం, ఆన్‌లైన్‌ నమోదులు వంటి సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు డయల్‌ చేసి ఫిర్యాదులను కూడా సమర్పించవచ్చు. టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఎన్నికల సంఘం ఓటర్లలో అవగాహన కార్యక్రమం చేపడుతుంది.

Updated Date - 2022-10-26T00:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising