ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర

ABN, First Publish Date - 2022-11-05T00:52:51+05:30

పలు రాష్ర్టాల్లో అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను కూల్చేందు కు బీజేపీ కుట్ర చేస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం భువనగిరిలో ని టీఆర్‌ఎస్‌ భవన్‌లో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కంచర్ల రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

24మంది మఠాధిపతులు, పీఠాధిపతులతో బేరసారాలు

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

యాదాద్రి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పలు రాష్ర్టాల్లో అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను కూల్చేందు కు బీజేపీ కుట్ర చేస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం భువనగిరిలో ని టీఆర్‌ఎస్‌ భవన్‌లో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేందుకు 24 మంది మఠాధిపతులు, పీఠాధిపతులను రంగంలోకి దింపిందని, వారితో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేపడుతోందన్నారు. రూ.వేలకోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందన్నా రు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 35వేల మెజార్టీతో గెలుస్తున్నారని, వామపక్షాల సహకారంతో ఈ విజయం సొంతమవుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేళ్లలో ప్రజలకోసం ఏ ఒక్క మంచిపనిచేయలేదని, ప్రజలను నష్టపరిచే విధానాల ను అలంభిస్తోందన్నారు. ధరల పెరుగుదలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికోసం రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ పాటుపడలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి జరగడంలేదా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లో రాజగోపాల్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. మునుగోడు ఉపఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎ్‌సపార్టీకి మద్దతు ప్రకటించినట్లు సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ఎం.డి.జహింగీర్‌, గోదా శ్రీరాములు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అమరేందర్‌గౌడ్‌, భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఆంజనేయు లు, భువనగిరి మార్కెట్‌ చైర్మన్‌ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, నాయకులు జన గాం పాండు, ఏవీ.కిరణ్‌కుమార్‌, ఎంపీపీ నిర్మల, జడ్టీటీసీ బీరు మల్ల య్య, సీపీఎం, సీపీఐ నాయకులు కొండమడుగు నర్సింహ, ఏశాల అశోక్‌, బాలరాజ్‌గౌడ్‌, దామోదర్‌రెడ్డి, దాసరి పాండు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T00:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising