రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే బొల్లం
ABN, First Publish Date - 2022-11-27T00:15:28+05:30
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
మోతె, నవంబరు 26: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల పరి ధిలోని కూడలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారం భించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులు పండిం చిన ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తుందన్నారు. మండల కేం ద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రతి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా, మేనమామగా ఆదుకుంటూ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, డీటీ సూరయ్య, ఎంపీవో హరిసింగ్, శీలం సైదులు, పొనుగోటి నర్సింహారావు, ఏలూరి వెంకటేశ్వరరావు, పురుషో త్తంరావు, గురుక్రిష్ణ, మేకల శ్రీను, కొండపల్లి వెంకట్‌రెడ్డి, నూకల శ్రీని వాస్‌రెడ్డి, ముత్తయ్య, రామక్రిష్ణ, మహేందర్‌నాయక్, పల్స మల్సూరు, కాంపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కోదాడటౌన్: క్రీడల్లో రాణించి కోదాడకు పేరు తేవాలని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కోరారు. క్యాంపు కార్యాలయంలో క్రికెట్ టోర్నమెంట్ జెర్సీని శనివారం ఆవిష్కరించి క్రీడాకారులకు పంపిణీ చేశారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. క్రీడల సాఽ దనకు గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుంద న్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి, టీఆర్‌ఎస్ నా యకులు అంజన్‌గౌడ్, శ్రావణ్, ఆంజనేయులు, నర్సింహారావు, ఉపేం దర్, వంశీ, లాజర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-27T00:15:30+05:30 IST