ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎ్‌సఆర్‌ నుంచి రెండు మండలాలకు నిధులు మంజూరు

ABN, First Publish Date - 2022-12-20T00:33:33+05:30

తెలంగాణ జెన్‌కో కంపెనీకి సంబంధించి సీఎ్‌సఆర్‌ స్కీమ్‌ నిధుల నుంచి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 19: తెలంగాణ జెన్‌కో కంపెనీకి సంబంధించి సీఎ్‌సఆర్‌ స్కీమ్‌ నిధుల నుంచి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. పవర్‌ప్లాంట్‌ నుంచి సమీపంలోని గ్రామాల వరకే సీఎ్‌సఆర్‌ స్కీమ్‌ నుంచి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇతర మండలాలకు సంబంధించి తన ప్రతిపాదనలు తిరస్కరించి కేవలం దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలకు సీఎ్‌సఆర్‌ నిధులు ఇచ్చారన్నారు. దామరచర్ల మండలంలోని కల్లెపల్లి గ్రామానికి రూ.50లక్షలు, దామరచర్ల మండల కేంద్రానికి రూ.60లక్షలు, మండలంలోని కేతావత్‌ తండాకు రూ.50లక్షలు, పుట్లగడ్డ తండాకు రూ.50లక్షలు, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్పాయిపాలెం గ్రామానికి రూ.55లక్షలు, తాటిచెట్టుతండాకు రూ.10లక్షలు, బంగారిగడ్డతండాకు రూ.20లక్షలు, గాంధీనగర్‌కు రూ.5లక్షలు, ఇంద్రానగర్‌కు రూ.10లక్షలు మొత్తం రూ.3కోట్ల10లక్షలను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మెటల్‌ రోడ్లకు, ఎల్‌ఈడీ లైట్లకు, గ్రావెల్‌ రోడ్లకు, హైమాక్స్‌ లైట్లకు, శ్మశానవాటికలకు మంజూరు చేశారని తెలిపారు.

Updated Date - 2022-12-20T00:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising