Munugode Results: మునుగోడు ఫలితం కోసం వెయిటింగా.. అయితే ముందు ఈ విషయం తెలుసుకోండి..
ABN, First Publish Date - 2022-11-05T16:36:15+05:30
మునుగోడు ఉప ఎన్నికలో (Munugode Election) పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను..
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో (Munugode Election) పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు (Munugode Result) మొదలవుతుంది. తొలుత 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. 15 రౌండ్లలో కౌంటింగ్‌ను (Munugode Counting) పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు.
ఏజెంట్లు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, ఈసీ ఇచ్చిన గుర్తింపు కార్డులను చూపితేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లను (Munugode Postal Ballot Votes) లెక్కిస్తారు. తొలి రౌండ్ ఫలితం (Munugode First Round Result) ఉదయం 9 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్‌తో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode Result Updates):
* మునుగోడు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు- 298
* మొత్తం ఎన్ని రౌండ్లలో లెక్కింపు- 15
* కౌంటింగ్ కేంద్రంలోని టేబుళ్ల సంఖ్య- 21
* మునుగోడులో మొత్తం పోస్టల్ బ్యాలెట్లు- 686
* మునుగోడు ఉప ఎన్నిక తొలి ఫలితం- ఉదయం 9 గంటలకు
* తొలుత ఓట్ల లెక్కింపు మండలం- చౌటుప్పల్
* తొలి ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్- చౌటుప్పల్ మండలం జైకేసారం
* తర్వాత.. సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్
* చివరి రౌండ్ ఫలితం- మధ్యాహ్నం 1 గంటకు
* చివరి రౌండ్ ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్- నాంపల్లి మండలం మహ్మదాపురం
Updated Date - 2022-11-05T16:38:51+05:30 IST