ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు మూగనోము

ABN, First Publish Date - 2022-11-05T00:44:41+05:30

రయ్‌.. రయ్‌మంటూ వచ్చిన ఖరీదైన కార్లు.. తెల్ల చొక్కాలు ధరించి వీధుల్లో హల్‌చల్‌ చేసిన నాయకులు.. జై జై అంటూ గల్లీల్లో తీసి న ర్యాలీలు.. మందు బాబులతో నిండిన మద్యం షాపులు.. ఎవరిని పలకరించినా గుప్పున కొట్టిన మందు వాసన.. మధ్యాహ్నం కాగా నే కిక్కిరిసిన హోటళ్లు.. చాయ్‌ దుకాణాల వద్ద గుమికూడిన జనం పిచ్చాపాటి.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పెద్ద పెద్ద గిన్నెల్లో వండిన చికెన్‌, మటన్‌ రుచులు.. అమ్మా.. అయ్యా.. తమ్ముడు అంటూ పలకరిస్తూ పెట్టిన దండాలు.. ముట్టజెప్పిన డబ్బులు.. సమస్య చెప్పగానే ఇట్టే తీర్చిన నాయకగణం.. అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ కురిపించిన హామీలు.. రక్తం ఉప్పొంగించేలా పెద్ద నేతల ప్రసంగాలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. పొట్టచేతబట్టుకొని వలస వెళ్లిన జీవులు సొంత ఊరికి వచ్చిన సంతోషం.. బంధు, మిత్రులతో కబుర్లు.. అంతటా పండుగ వాతావారణం.. ఉప ఎన్నిక తెచ్చిన కృత్రిమ పండు గ.. అనుకున్న రోజు రానే వచ్చింది.. ఎలక్షన్ల పండుగ చివరి రోజు పోలింగ్‌.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఇదే ఇచ్చారంటూ నిష్ఠూరాలు.. ఊరుగాని ఊరు నుంచి వస్తే ఇదేంటని నిలదీతలు.. ఇది మొన్నటి వరకు మునుగోడులో సీన్‌.. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు ఒక్కసారిగా ఆ సీన్‌ మారింది.

నిర్మానుష్యంగా మారిన గట్టుప్పల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లెలు, పట్టణాల్లో ‘రాజకీయ’ నిశ్శబ్ధం

మునుగోడు పోలింగ్‌ ముగియడంతో నిర్మానుష్య పరిస్థితి

రెండునెలలుగా ఉపఎన్నిక సందడి

పలు పార్టీల ప్రచారంతో నిత్యం రద్దీ

అధిష్ఠాన పెద్దలు నియోజకవర్గంలోనే మకాం

స్థానికంగా అద్దె ఇళ్లల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు

రయ్‌.. రయ్‌మంటూ వచ్చిన ఖరీదైన కార్లు.. తెల్ల చొక్కాలు ధరించి వీధుల్లో హల్‌చల్‌ చేసిన నాయకులు.. జై జై అంటూ గల్లీల్లో తీసి న ర్యాలీలు.. మందు బాబులతో నిండిన మద్యం షాపులు.. ఎవరిని పలకరించినా గుప్పున కొట్టిన మందు వాసన.. మధ్యాహ్నం కాగా నే కిక్కిరిసిన హోటళ్లు.. చాయ్‌ దుకాణాల వద్ద గుమికూడిన జనం పిచ్చాపాటి.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పెద్ద పెద్ద గిన్నెల్లో వండిన చికెన్‌, మటన్‌ రుచులు.. అమ్మా.. అయ్యా.. తమ్ముడు అంటూ పలకరిస్తూ పెట్టిన దండాలు.. ముట్టజెప్పిన డబ్బులు.. సమస్య చెప్పగానే ఇట్టే తీర్చిన నాయకగణం.. అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ కురిపించిన హామీలు.. రక్తం ఉప్పొంగించేలా పెద్ద నేతల ప్రసంగాలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. పొట్టచేతబట్టుకొని వలస వెళ్లిన జీవులు సొంత ఊరికి వచ్చిన సంతోషం.. బంధు, మిత్రులతో కబుర్లు.. అంతటా పండుగ వాతావారణం.. ఉప ఎన్నిక తెచ్చిన కృత్రిమ పండు గ.. అనుకున్న రోజు రానే వచ్చింది.. ఎలక్షన్ల పండుగ చివరి రోజు పోలింగ్‌.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఇదే ఇచ్చారంటూ నిష్ఠూరాలు.. ఊరుగాని ఊరు నుంచి వస్తే ఇదేంటని నిలదీతలు.. ఇది మొన్నటి వరకు మునుగోడులో సీన్‌.. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు ఒక్కసారిగా ఆ సీన్‌ మారింది.

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

మునుగోడు నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాల్లో రెండు నెలలపాటు రాజకీయ సందడి నెలకొంది. ఊరూరా ప్రచార రథాలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచారాన్ని అదరగొట్టారు. కరపత్రాలు, పార్టీల గుర్తులు, ఎన్నిక నమూనా ఈవీఎంను చేత పట్టుకు ని ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా రాజకీయ నేతలతో హడావుడి నెలకొంది. గురువారం అర్థరాత్రి వరకు ఉపఎన్నిక అలజడి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఘర్షణలు, పోలీసులతో వాగ్వాదం, కేసులు నమోదు వంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ఉపఎన్నిక పోలింగ్‌ ఈ నెల 3వ తేదీన ముగిసింది. దీంతో పల్లెలు, పట్టణాల్లో తుఫాను వెలిసిన తర్వాత నెలకొనే నిశ్చబ్ధ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు కూడా మునుగోడు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల పెద్దలుసహా పార్టీల్లోని ముఖ్యనేతలు, కార్యకర్తలు నిత్యం నియోజకవర్గానికి రాకపోకలు కొనసాగిస్తూ, పల్లెలు, పట్టణాల్లో వందలాది వాహనాలతో నిత్యం రద్దీగా కన్పించాయి.

నెలరోజులపాటు గ్రామాల్లోనే మకాం

టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీటీసీ స్థానానికి ఒక మంత్రి, గ్రామానికి ఓ ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ, ఇతర నేతలను రంగంలోకి దించింది. నెలరోజులపాటు ఆయా గ్రామాల్లోనే ఉంటూ, స్థానిక పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు. ఈనేపథ్యంలో నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, చండూరు మునిసిపాలిటీలతోపాటు సంస్థాన్‌నారాయణపురం, చండూరు, నాం పల్లి, గట్టుప్పల, మర్రిగూడ మం డల కేంద్రాలతోపాటు గ్రామాల్లో నేతలు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలు ఎంపీటీసీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులతోపాటు ముఖ్య నేతలంతా కూడా ఆయనవెంటే ఉన్నారు. ఈనేపథ్యంలో ఒక్కో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వద్ద కనీసం 100 మంది ముఖ్యనేతలు ఉండటంతో గ్రామాలు, పట్టణాల్లో నిత్యం రాజకీయ సందడి నెలకొంది.

కేంద్రమంత్రులు సహా సీనియర్లంతా..

బీజేపీ అధిష్ఠానం ఈ ఎన్నికను సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించింది. కేంద్రమంత్రులతోపాటు పార్టీలోని సీనియర్‌ నేతలంతా కూడా ఆయా గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్‌ పార్టీ ము ఖ్యనేతలు ఆయా మండలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోయినప్పటికీ, నిత్యం గ్రామాల్లో పర్యటించి, అభ్యర్థి గెలుపుకోసం ప్రచా రం నిర్వహించారు. ఈ పార్టీలతోపాటు బీఎస్పీ, స్వతంత్రులు కూడా ప్రచారంలో జోరు పెంచారు. పలు పార్టీల నాయకులు ప్రచారంకోసం స్థానికంగా ఉండటంతో గ్రామాల్లో మద్యం ఏరులై పారింది. ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు, తినుబండారాల కవర్లు దర్శనమిచ్చాయి. అయితే ఆయా గ్రామాల పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై... ఖాళీస్థలాలతోపాటు వీధు ల్లో పడేసిన మద్యం సీసాలు, ఇతర చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు తరలించారు. అయితే రాజకీయ నేతలు తీసుకున్న అద్దెఇళ్లు కూడా ఖాళీ చేయడంతో ఆయా ప్రాంతాలన్నీ కూడా రాజకీయ సందడి లేక నిర్మానుష్యంగా మారాయి. రాజకీయ నేతలు పర్యటనలు, ప్రచారాలతో నెలరోజులపాటు బిజీబిజీగా ఉన్న స్థానికు లు.. ఉపఎన్నిక పోలింగ్‌ ముగియడంతో పల్లెలు మూగబోయాయి.

వ్యవసాయ పనులకు ఇక్కట్లు

ఈ సీజన్‌లో వరికోతలు, పత్తి తీయడం, కూరగాయలు సాగు చేసే పొలాల్లో కలుపు తీయడం వంటి పనులు నడుస్తున్నాయి. నిత్యం ఏదో రాజకీయ పార్టీకి చెందిన సమావేశమో, బహిరంగ సభ నో ఉండటంతో రెండునెలలుగా గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నిత్యం పార్టీలవారీగా కూలీలను వాహనాల్లో తీసుకెళుతూ ప్రచారాని కి వినియోగించుకున్నారు. దీంతో రైతులే స్వయంగా పత్తిని తీసుకోవడం, వరికోత వంటి పనులు చేపట్టారు. పోలింగ్‌ ముగియడంతో గ్రామాల్లోని ప్రజలంతా కూడా ఎవరి పనుల్లో వారి నిమగ్నమయ్యారు. దీంతో ఉదయం, సాయంత్రంవేళల్లో రాజకీయ సందడిగా ఉన్న గ్రామాలు, పట్టణాలు నేడు నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది.

క్యాంప్‌ కార్యాలయాలు, ఫాంహౌ్‌సలలో రాజకీయం

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల పెద్దలు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాల ను ఏర్పాటుచేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లోని పలుఇళ్లను అద్దెకు తీసుకున్నా రు. పలుచోట్ల ఇళ్లు పెద్దగా లేకపోవడంతో టెం ట్లు వేసుకున్నారు. చౌటుప్పల్‌ మం డలంలోని పలు ప్రాంతాల్లోని ఫాం హౌ్‌సలను అద్దె కు తీసుకున్నారు. బీజేపీ అభ్య ర్థి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో వాటర్‌ప్రూ్‌ఫతో కూడిన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈక్యాంపు కార్యాలయంలోనే కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు మకాంఏసి ప్రచారాన్ని చేపట్టారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌మర్రిగూడ మండలకేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. చండూరులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్యాంపు కార్యాలయాలకు ముఖ్యనేతలు వస్తూ, నేతల హడావుడితో సందడినెలకొంది. అదేవిధంగా పలుపార్టీలకు చెందిన కళాకారులు గ్రామాల్లోనే ఉంటూ, కళారూపాలు ప్రదర్శించాయి. కళాకారుల గజ్జెల చప్పుళ్లు వినబడడంలేదు.

బోసిపోయిన పల్లెలు... కనిపించని సందడి

చౌటుప్పల్‌: నియోజకవర్గంలో ఇన్నాళ్లు ఏపల్లె చూసినా జన జాతరను తలపించింది. ఏనాడూ ఖరీదైన కార్లు కనిపించని పల్లెల్లో సైతం కోట్లరూపాయల విలువచేసే కార్లు చెక్కర్లు కొట్టాయి. గురువారం మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా సైలెంట్‌గా మారింది. ఓట్ల జాతర ముగియడంతో నిన్నటివరకు తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు సందడిగా మారిన రోడ్లు కాలనీలు సైతం ఒక్కసారిగా బోసిపోయాయి. మొన్నటి వరకు టీ పాయింట్లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు సాధారణ రోజుల్లో కంటే రద్దీగా కనిపించాయి. వందలాదిగా వచ్చిన ప్రజలతో ఫుడ్‌సెంటర్లు రద్దీగా ఉండేవి. కొన్ని సందర్భాలలో ఆహారం దొరక్క వెనుదిరిగి వెళ్లిన సంఘటనలూ లేకపోలేదు. ప్రస్తుతం రెస్టారెంట్లు సైతం కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. ఓట్ల పండుగ ముగియడంతో పార్టీ కార్యాలయాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిన్న మొన్నటి వరకు ఓటింగ్‌ గురించి చర్చించుకున్న ప్రజలు నిన్నటి నుంచి ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఏపల్లె చూసినా, జెండాలు ఇతర ఎన్నికల సామగ్రి దర్శనమిస్తోంది.

Updated Date - 2022-11-05T00:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising