సింగరేణి ప్రైవేటీకరణపై మోదీవి అబద్ధాలు

ABN, First Publish Date - 2022-11-16T00:44:35+05:30

విలువలతో కూడిన ప్రమాణాలతో ఉండాల్సిన ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నిత్యం పచ్చి అబద్ధాలతో పాలన సాగిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

సింగరేణి ప్రైవేటీకరణపై మోదీవి అబద్ధాలు
మునుగోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మునుగోడు, నవంబరు 15: విలువలతో కూడిన ప్రమాణాలతో ఉండాల్సిన ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నిత్యం పచ్చి అబద్ధాలతో పాలన సాగిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థను ప్రైవేటీకరణ చేయబోమనే వ్యాఖ్యలు అందుకు నిదర్శనమన్నారు. మునుగోడులో మంగళవారం నిర్వహించిన సీపీఐ నియోజకవర్గస్థాయి కౌన్సిల్‌ సమావేశంలో హాజరైన ఆయన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ హయాంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్నారు. ప్రధానంగా వ్యవస్థలు చిన్నాభిన్నం కావటమేనన్నారు. మునుగోడు ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంపపెట్టుగా మారిందన్నారు. బీజేపీ అరాచకాలను నియంత్రించేందుకు సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు టీఆర్‌ఎస్‌తో కలిసి పోరాడతామన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్య దర్శులు నెల్లికంటి సత్యం, గోదాసు శ్రీరాములు, నాయకులు మందడి నర్సిరెడ్డి, కె. శ్రీనివాసులు, టీ. వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, చాపల శ్రీనుపాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising