ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో..దేవుడా..

ABN, First Publish Date - 2022-11-14T01:08:08+05:30

అయ్యో..దేవుడా.. ఎంత పనిచేశావయ్యా.. అంటూ మృతులు, క్షతగాత్రుల బంధువులు కోదాడ ఆసుపత్రిలో విల పించా రు. కోదాడ ఆసుపత్రిలో ఎక్కడ చూసిన విషాద వాతావరణం కనిపించింది. జాతీయ రహదారిపై మునగాల శివారులో శనివారం ఆర్ధ రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెంద గా, 27మంది గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాల అప్పగింత

కోదాడ రూరల్‌,నవంబరు 13: అయ్యో..దేవుడా.. ఎంత పనిచేశావయ్యా.. అంటూ మృతులు, క్షతగాత్రుల బంధువులు కోదాడ ఆసుపత్రిలో విల పించా రు. కోదాడ ఆసుపత్రిలో ఎక్కడ చూసిన విషాద వాతావరణం కనిపించింది. జాతీయ రహదారిపై మునగాల శివారులో శనివారం ఆర్ధ రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెంద గా, 27మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు కోదాడ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమచికిత్స అందించి, అనంతరం కొంతమందిని ఖమ్మం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించగా, మరికొంతమందిని సూర్యాపేట కు, మరికొంతమందిని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబా ద్‌ కు తరలించిన వారిలో చింతకాయల సంధ్య పరిస్థితి విషమంగా ఉందని వై ద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన నారగాని కోటయ్య, తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, గుండు జ్యోతి, ఉదయ్‌ లోకేష్‌ మృతదేహాలకు కో దాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌ ఆసుపత్రికి వచ్చి ప్రమా దానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుం బాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందించాలని మృతులు బంధువులు ఆర్డీవోను కోరారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఆర్డీవో ఉన్నారు.

జీఎంఆర్‌ సంస్థ వైఫల్యంతోనే ప్రమాదాలు

కోదాడ టౌన్‌: జీఎంఆర్‌ సంస్థ వైఫల్యంతోనే జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు పందిరి నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందటం, ప లువురు గాయపడటం బాధాకర మన్నారు. ప్రమాదాలు జరగ కుండా జీఎంఆర్‌ సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. మృ తుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో చెల్లించి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, గాయపడిన వారికి ఉచి తంగా చికిత్స అందించాలని ఆయన కోరారు.

Updated Date - 2022-11-14T01:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising