ఆయిల్‌పామ్ సాగు రైతులను గుర్తించాలి
ABN, First Publish Date - 2022-11-04T01:28:31+05:30
ఈ నెల చివరిలోగా ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులను గుర్తించాలని కలెక్టర్ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏవో, ఏఈవో, ఉద్యానశాఖ అధికారులు, ఎరువుల డీలర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
రూ.193 విలువైన మొక్కను రూ.20కే అందిస్తున్నాం
వ్యవసాయ అధికారుల సమావేశంలో కలెక్టర్ పమేలాసత్పథి
భువనగిరి రూరల్, నవంబరు 3: ఈ నెల చివరిలోగా ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులను గుర్తించాలని కలెక్టర్ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏవో, ఏఈవో, ఉద్యానశాఖ అధికారులు, ఎరువుల డీలర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే జనవరి నుంచి ప్రారంభించే ఆయిల్‌పామ్ సాగు కార్యాచరణకు జిల్లాలో మొత్తం 5,800 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 769మంది రైతుల ద్వారా 3,861 ఎకరాలను గుర్తించామన్నారు. రూ.193 విలువైన ఆయిల్‌పామ్ మొక్కను సబ్సిడీపై రైతుకు రూ.20కే అందిస్తున్నామన్నారు. రాబోయే యాసంగిలో రైతులు జీవ ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు పొందేలా, వరిసాగులో విత్తనాలు వెదజల్లే పద్ధతిని రైతుల్లో ప్రోత్సహించేలా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏవో కె.అనురాధ, హార్టికల్చర్ అధికారి అన్నపూర్ణ, ఏడీఏలు బి.దేవ్‌సింగ్, వెంకటేశ్వర్ రావు, పద్మావతి పాల్గొన్నారు.
ధనుర్వాతం, కోరింత దగ్గు నుంచి రక్షణ కల్పించాలి
ధనుర్వాతం, కోరింత దగ్గు నుంచి రక్షణ పొందేందుకు టీడీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ పమేలాసత్పథి సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7నుంచి 19వరకు వ్యాక్సినేషన్‌కు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జడ్పీసీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో కె.మల్లికార్జున్‌రావు, డీఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-11-04T01:28:32+05:30 IST