ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే పోలింగ్‌

ABN, First Publish Date - 2022-11-03T00:59:24+05:30

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈ నెల 3న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే చండూరులో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ అధికారులు పోలీస్‌ బందోబస్తు నడుమ వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. పోలింగ్‌ గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు బరిలో నిలిచారు.

చండూరులో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

మొత్తం 2.41లక్షల మంది ఓటర్లు

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈ నెల 3న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే చండూరులో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ అధికారులు పోలీస్‌ బందోబస్తు నడుమ వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. పోలింగ్‌ గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు బరిలో నిలిచారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 45మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,21,720మంది, మహిళలు 1,20,128 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. వీరంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,500 మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటుండగా, అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రానికి ఒక ఎస్‌ఐతో పాటు తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి బైండోవర్‌ చేశారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటినీ నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గంలోని 100 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో 24గంటల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు. పోలింగ్‌ రోజు బ్యాలెట్‌ యూనిట్లు మొరాయిస్తే వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు పెద్ద సంఖ్యలో బెల్‌ కంపెనీకి చెందిన ఇంజనీర్లను అధికారులు అందుబాటులో ఉంచారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి తరలిన పోలింగ్‌ సిబ్బంది

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి చండూరు జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇక్కడ పోలింగ్‌ సిబ్బందికి ఎన్నిక సామగ్రి పంపిణీ చేయగా, వారు కేటాయించిన రూట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో పోలీస్‌ భద్రత నడుమ పోలింగ్‌ కేంద్రాలకు బుధవారం సాయంత్రమే చేరుకున్నారు. ఉప ఎన్నిక జనరల్‌ అబ్జర్వర్‌ పంకజ్‌కుమార్‌, నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. పోలింగ్‌ రోజు పాటించాల్సిన జాగ్రత్తలపై వారు పలు సూచనలు చేశారు.

మునుగోడులో ఐదు సమస్యాత్మక గ్రామాలు

మునుగోడు, దేవరకొండ: మునుగోడు మండలంలో ఐదు సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించి అక్కడ అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు. మండలంలో చొల్లేడు, కొరటికల్‌, కిష్టాపురం, చీకటిమామిడి, పలివెలను సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా, మునుగోడు ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రానికి సిబ్బంది ఎన్నిక సామగ్రితో బస్సులో రాగా, పాఠశాల ముఖద్వారం గేట్‌ నుంచి బస్సు లోనికి వెళ్లకపోవడంతో సిబ్బంది నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ముఖద్వారం గేట్‌ అడ్డుతగలడంతో బస్సు లోనికి వెళ్లలేకపోయింది. కొద్దిసేపటి తరువాత పంచాయతీ సిబ్బంది గేట్‌ను సరిచేయడంతో బస్సు పాఠశాలలోనికి వెళ్లింది. నాంపల్లి మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు.

నూతన ఓటర్లకు డిజిటల్‌ కార్డులు

మర్రిగూడ మండలంలో నూతన ఓటర్లకు డిజిటల్‌ ఓటర్‌ కార్డులను రెవెన్యూ సిబ్బంది బుధవారం పంపిణీ చేశారు. మండలంలో 1,120 మంది నూతన ఓటర్లు ఉన్నారు. వారందరికీ డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డును అందజేసినట్టు ఎన్నిక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రూ.4 కోట్ల నగదు స్వాధీనం

చౌటుప్పల్‌ రూరల్‌, సంస్థాన్‌నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాచకొండ పరిధి మునుగోడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఇప్పటి వరకు రూ.4కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్‌ ఎం.భగవత్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పోలీసు సిబ్బందికి ఉప ఎన్నిక భద్రతా విధులపై బుధవారం అవగాహన కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలకోడ్‌ అమల్లో ఉన్నందున, కమిషనరేట్‌ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద మొత్తం రూ.4కోట్ల నగదుతోపాటు వెయ్యి లీటర్ల మద్యం, 5కిలోల గంజాయి పట్టుకున్నట్లు వివరించారు. మునుగోడు నియోజకవర్గంలో 35 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద తొమ్మిది మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పోలింగ్‌ ముగిసే వరకు చెక్‌పోస్టులు కొనసాగుతాయిన్నారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి బైండోవర్‌ చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే 100కు డయల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందితో సీపీ సమావేశం నిర్వహించారు. ఆయన వెంట అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ నారాయణరెడ్డి, అదనపు డీసీపీ శ్రీబాల, ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఉన్నారు.

ప్రచారం ఫలించేనా శ్రమకు విలువ దక్కేనా?

మునుగోడు ఉపఎన్నిక ప్రచార సరళిపై అన్ని రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. నోటిఫికేషన్‌కు ముందు, ఆ తర్వాత నిర్వహించిన ప్రచారం ఎలా ఉంది? ఓటర్ల నుంచి ఏ విధంగా స్పందన వచ్చిందనే దానిపై టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఉపఎన్నిక అనూహ్యంగా రావడంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అప్రమత్తమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అప్రమత్తమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి; రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే కదన రంగంలోకి దూకారు. చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్‌ కేడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ నిఘా ద్వారా తెలుసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు ముందు నుంచే నియోజకవర్గంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చే ప్రయత్నం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. పార్టీ మారడానికి ముందు రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వం తనకు సహకరించకపోవడం వల్లే నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాననే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాత్రం కేంద్ర ప్రభుత్వం రూ.18వేలకోట్ల కాంట్రాక్టును రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చినందునే బలవంతంగా ఈ ఉపఎన్నికను ప్రజలపై రుద్దిందని ఆరోపిస్తూ పెద్దఎత్తున ప్రచారం సాగించాయి. ఇక నోటిఫికేషన్‌ వచ్చాక నియోజకవర్గం అంతటా ప్రచారం ముమ్మరమైంది. రాష్ట్ర అగ్రనేతలు స్థానికంగా నివాసమున్నారు. అధికార పార్టీ నుంచి 75 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో మొహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మర్రిగూడలో క్యాంపు ఆఫీస్‌ ఏర్పాటు చేసుకుని 12రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి కార్యకర్తల్లో జోష్‌ నింపారు. రోడ్‌షోలు, ప్రెస్‌మీట్‌ల ద్వారా ప్రచారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొంపల్లిలో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుని ప్రచారం సాగించారు. రేవంత్‌రెడ్డి ఓ వైపు రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్రలో పాల్గొంటూనే మరోవైపు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆయన అత్తగారి ఊరైన పలివెలలో ఉండి ప్రచారం నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం దాదాపు 15రోజులు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారంతో హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉపఎన్నిక ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 6గంటలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిలిపివేశాయి. చివరి రోజు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డిలు రోడ్‌షోలో పాల్గొని ప్రచారం చేయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం సాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొంపెల్లిలో జరిగిన మహిళా గర్జనలో పాల్గొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మునుగోడులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనగా మరుసటి రోజు జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రచారం ముగింపునకు రెండు రోజుల ముందు అంటే గత నెల 30న సీఎం కేసీఆర్‌ చండూరులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ సైతం గత నెల 31, ఈ నెల 1వ తేదీన అన్ని మండలాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించింది. కాంగ్రెస్‌ కూడా మహిళా గర్జనతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రచారాలు ఎంతమేరకు ఫలిస్తాయనే దానిపై రాజకీయ పార్టీలు ఇప్పటికే విశ్లేషణలు కూడా ప్రారంభించాయి.

Updated Date - 2022-11-03T00:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising