అద్దెబస్సులు నడపలేం
ABN, First Publish Date - 2022-11-13T00:13:49+05:30
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది ఇక్కడి ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. రోజూ వేలాది మంది భక్తులు వచ్చే యాదగిరిగుట్ట ఆర్టీసీ అంటే డబ్బులే డబ్బులు. అందులోనూ ఆర్టీసీ బస్సులంటే కిక్కిరిసిపోయే ప్రయాణికులతో కాసుల వర్షం కురుస్తుందనుకుంటారు అంతా. కానీ ఇక్కడి పరిస్థితి మాత్రమే వేరుగా ఉంది.
ఆర్టీసీ నిర్ణయాలతో పెరిగిన ఆందోళనలు
న్యాయం చేయాలంటున్న యజమానులు
15 బస్సులను స్వాధీనం చేసుకున్న బ్యాంకర్లు
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది ఇక్కడి ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. రోజూ వేలాది మంది భక్తులు వచ్చే యాదగిరిగుట్ట ఆర్టీసీ అంటే డబ్బులే డబ్బులు. అందులోనూ ఆర్టీసీ బస్సులంటే కిక్కిరిసిపోయే ప్రయాణికులతో కాసుల వర్షం కురుస్తుందనుకుంటారు అంతా. కానీ ఇక్కడి పరిస్థితి మాత్రమే వేరుగా ఉంది.
- యాదగిరిగుట్ట రూరల్
ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇచ్చి నష్టపోతున్నామని య జమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జం ట నగరాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండడం, మైలేజీ తక్కువగా వస్తుండడంతో తీవ్రం నష్టాలు చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ అధికారులకు లేఖలు రాస్తున్నారు. తమ బస్సుల మైలేజీ విషయలో సిటీ, సబర్బన్ బస్సులుగా పరిగణించాలని జూ బ్లీ బస్టాండ్, మహాత్మగాంధీ బస్‌స్టేషన్ల వరకు కాకుండా ఉప్పల్ వరకు మాత్రమే నడిపించే విధంగా కొత్తరూట్ ఏర్పాటు చేయాలని యజమానులు లేఖలో స్పష్టం చేయడంతోపాటు ఈ నెల 10వ తేదీన ధర్నాకు దిగారు.
ఉన్న ఆస్తులు అమ్ముకొని బస్సులు కొంటే..
ఉన్న భూములు, ఆస్తులు, మహిళలపై ఉన్న బంగారు ఆభరణాలు అమ్ముకొని అద్దెబస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తే మైలేజ్ కారణాలు చూపుతూ చెల్లింపుల్లో వ్య త్యాసం ప్రదర్శిస్తుండడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని డిపోల్లో అత్యధికంగా యాదగిరిగుట్టలో అద్దె బస్సులన్నింటికీ కలిపి నెలకు డీజిల్ రికవరీ కిం ద రూ.9లక్షలనుంచి రూ.17లక్షల వరకు అవుతుంది. మిగ తా వచ్చే డబ్బులతో బ్యాంకులకు ఫైనాన్స్‌లు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలేజ్ ఇవ్వడంలో తేడాలను చూపడంతో కనీ సం లీటర్‌కు 5.4కి.మీలు సైతం రాక నష్టాలు పెరిగిపోతున్నాయని యజమానులు పేర్కొంటున్నారు. బ్యాంకు పైనా న్స్ చెల్లింకపోవడంతో బ్యాంకు అధికారులు ఇప్పటికే గుట్ట డిపోలో 15 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. మరో 10 బస్సులను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం డిపోలో 61 అద్దె బస్సులుండగా, అందులో 15 పో గా ప్రస్తుతం 46 బస్సులు మాత్రమే ఉన్నాయి. కొవిడ్ సమయంలోనూ బస్సులను నడిపించి, ఆర్థికంగా చితికిపోయినా ఎలాంటి లాభం లేదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు సాధ్యమైనంత త్వరగా అద్దెబస్సుల మైలేజీ సిటీ సబర్బన్ బస్సులుగా పరిగణించాలని, సిటీ ట్రాఫిక్‌లో తిరిగే సమయంలో తేడాలను గుర్తించి కిలోమీటరు రేటు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబరు 1వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆత్మహత్యలే శరణ్యం : బాలవర్ధన్‌రెడ్డి, ప్రైవేట్ అద్దె బస్సుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు
అద్దె బస్సుల ఖర్చు భరించలేక, ఆర్టీసీ సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో నష్టాల పాలువుతు న్నాం. కిలోమీటరు రూ.9.32 మాత్రమే చెల్లిస్తున్నారు. నెలకు రూ.60వేలు మాత్రమే వస్తున్నా యి. ఇందులో ఖర్చులు అధికంగా ఉన్నాయి. కిలోమీటరుకు చార్జీ పెంచి ఆదుకోవాలి. లేదంటే చేసిన అప్పులు, చెల్లించాల్సిన బస్సుల ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్యలే శరణ్యమవుతాయి.
రాష్ట్రస్థాయిలోనే పరిష్కారం : శ్రీనివా్‌సగౌడ్, డిపో మేనేజర్, యాదగిరిగుట్ట
అద్దెబస్సుల మైలేజ్, సిటీ సబర్బన్‌గా మార్చడానికి మాకు అఽధికారం లేదు. అది కేవలం రాష్ట్రస్థాయి అధికారులకే ఉంది. అక్కడే పరిష్కారం లభిస్తుంది.
Updated Date - 2022-11-13T00:13:51+05:30 IST