ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలోకి దిగి వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2022-12-15T01:03:20+05:30

వ్యవసాయ బావిలోకి దిగిన వ్యక్తి గల్లంత య్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) గుండ్లసింగారం గ్రామానికి చెందిన రైతు కట్ట మల్లారెడ్డి దగ్గర జీతం ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన్‌కల్‌ డిసెంబరు 14: వ్యవసాయ బావిలోకి దిగిన వ్యక్తి గల్లంత య్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) గుండ్లసింగారం గ్రామానికి చెందిన రైతు కట్ట మల్లారెడ్డి దగ్గర జీతం ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. గుండ్లసింగారం గ్రామ శివారులో ఉన్న రైతు వ్యవసాయ భూమిలోని బావిలో మోటారు నీరు తక్కువగా పోస్తున్నందున దానిని సరి చేయడానికి దేవయ్య బావిలోకి బుధవారం మధ్యాహ్నం దిగాడు. బావి ఒడ్డున మరో రైతు నారా యణరెడ్డి తాడుతో దేవయ్యను పట్టుకున్నారు. బావిలో ఈత కొడుతూ మోటా రును సరి చేస్తూ మధ్యలోకి వెళ్లిన దేవయ్య మునుగుతుండగా, ఒడ్డున ఉన్న రైతు నారాయణరెడ్డి కాపాడేయత్నం చేయగా ఫలించలేదు. దేవయ్య బావి నీటిలో మునిగిన విషయాన్ని గ్రామస్థులకు, పోలీసులకు రైతు నారాయణకు సమాచారం అందించాడు. బావిలో 45 అడుగుల మేర నీరు ఉన్నందున నీటి మూడు మోటార్లతో రాత్రి వరకు తోడినా మట్టం తగ్గలేదు. దేవయ్య భార్య ఆరేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బావిలో నీటిని తోడే కార్యక్రమాన్ని తుంగతుర్తి ఎస్‌ఐ డానియల్‌, ప్రొబేషనరీ ఎస్‌ఐ వెంకటరమణ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2022-12-15T01:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising