ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.5లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం

ABN, First Publish Date - 2022-10-24T01:17:14+05:30

మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ.5లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నల్లగొండ జిల్లా చండూరులో ప్రచారం

చండూరు, అక్టోబరు 23: మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ.5లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం చండూరులో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో గతంతో పోలిస్తే దేశం నేడు ఏ స్థాయిలో ఉందో యువత, విద్యావంతులు గమనించాలన్నారు. గతంలో దేశ యువత ఇతర దేశాలపై ఆశలు పెట్టుకుని ఉండేవారని, మోదీ నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న గొప్పగొప్ప కంపెనీలన్నీ దేశంలోనే పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ రైతు పక్షపాతి, రైతు బాంధవుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాల కోసం రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టి, మద్యం ద్వారా రూ. 45 వేల కోట్లు గుంజుతున్నాడని విమర్శించారు. మునుగోడులో కేసీఆర్‌ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పోటీచేసే అభ్యర్థుల్లో ఆదుకునే వారెవరో, దోచుకునే వారెవరో మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తూ, మునుగోడుపై దండుపాళ్యం ముఠా మోహరించి మరింత దోపిడీ చేస్తుందని విమర్శించారు. మునుగోడులో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఇప్పటి వరకు స్థల సేకరణ చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రతీ బీజేపీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కేసీఆర్‌ పాదాల దగ్గర ఫణంగా పెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ దోటి సుజాతవెంకటే్‌షయాదవ్‌ పట్టణ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి, మాజీ సర్పంచ్‌ కోడి గిరిబాబు, కౌన్సిలర్లు గుంటి వెంకటేశం, అనంత మంగమ్మగిరిధర్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-24T01:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising