ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని

ABN, First Publish Date - 2022-11-04T17:57:12+05:30

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ (Telangana Telugu Desam Party) కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj)నియమితులయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. మరోవైపు ఈ నెల 10న కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు.

Updated Date - 2022-11-04T17:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising