బండి యాత్రకు ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-11-26T01:39:46+05:30
జిల్లాలో బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రపై దృష్టిపెట్టారు.
28న బైంసా నుంచి 5వ విడత యాత్రను ప్రారంభించనున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జిల్లాలో నుంచి భారీగా క్యాడర్‌ను తరలించేందుకు పార్టీ నాయకులు కసరత్తు
నేడు పార్టీ నేతల సమావేశం
నిజామాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రపై దృష్టిపెట్టారు. ఈనెల 28 నుంచి భైంసా నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రకు జిల్లా నుంచి భారీ ఎత్తున క్యాడర్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఈ ఏర్పాట్లపైన సమావేశం నిర్వహించడంతో పాటు నియోజకవర్గాల వారీ గా తరలించేందుకు ఏర్పాట్లను చేయనున్నారు. భైంసా నుంచి కరీంనగర్ వరకు జరిగే ఈ యాత్ర కోసం పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందు కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, క్యాడర్ పాల్గొనే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. అదే రీతిలో సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతంపైన దృష్టిపెట్టారు. కొత్త అసెంబ్లీ కన్వీనర్‌లు, జాయింట్ కన్వీనర్‌లను నియమించడంతో మరింత ఉత్సామంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
బైంసాలో భారీ బహిరంగ సభ
భైంసా నుంచి ఈ నెల 28న బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర 5వ విడత పాదయాత్ర చేపడుతున్నారు. భైంసాలో భారీ బహిరంగ సభ ను నిర్వహించడంతో పాటు పెద్దమొత్తంలో క్యాడర్‌తో పాదయాత్ర ప్రా రంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఈ జిల్లా నుంచి కూడా క్యాడర్‌ను ఆ బహిరంగ సభకు హాజరయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గాల వారిగా టార్గెట్‌లను ఇచ్చి దానికి అనుగుణంగా క్యాడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జిల్లాకేంద్రంలో పార్టీ సీనియర్ నేతల ఆద్వర్యంలో ప్రజా సంగ్రామయాత్ర ఏర్పాట్లపైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కన్వీనర్‌లతో పాటు సీనియర్ నేతలందరు పాల్గొననున్నారు. భైంసా కు భారీగా జనాన్ని తరలించేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. బోదన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మొత్తంలో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాల్కొండ, బాన్సూవాడ నుంచి కొద్దిమొత్తంలో క్యాడర్‌ను ఈ సభకు హాజరయ్యేవిధంగా చర్య లు చేపడుతున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతుండడంతో సభను విజయవంతం చేసేందుకు బీజేపి నేతలు చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గాల వారిగా టార్గెట్ ఇవ్వడంతో పాటు క్రీయాశీల కార్యకర్తలందరు హాజరయ్యేవిధంగా చూడడనున్నారు. ఈ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర భైంసా పట్టణం నుంచి నిర్మల్, ఖానాపూర్, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్లా మీదుగా కరీంనగర్ వరకు ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. యాత్ర వెంట కూడా జిల్లా నుంచి కొంతమంది క్యాడర్ హాజరయ్యేవిధంగా నేడు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి
జిల్లాలో సంస్థాగత పార్టీ బలోపేతంపైన కూడా నేతలు దృష్టిపెట్టా రు. అన్ని గ్రామాల పరిధిలో క్యాడర్‌ను పెంచడంతో పాటు నియోజకవర్గాల వారీగా క్యాడర్‌ను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు కూడా చేపట్టేందుకు కొంతమంది నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గం పరిదిలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదేరీతిలో ఇతర నియోజకవర్గాల్లో పలువురు నేతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు చెందిన పలు పార్టీలను సీనియర్ నేతలతో టచ్‌లో ఉన్న పార్టీ నేతలు వారిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భైంసా పట్టణం నుంచి ప్రారంభమ య్యే బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు పార్టీ జిల్లా అద్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య తెలిపా రు. వచ్చే ఎన్నికలపైన దృష్టిపెట్టిన నేతలు సంస్థాగత కార్యక్రమాల్లో బిజీ అయ్యేందుకు సిద్ధ మవుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ నేతలు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నారో తేలే అవకాశం ఉంది.
Updated Date - 2022-11-26T01:39:51+05:30 IST