ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

unesco award: దోమకొండ కోటకు యూనెస్కో అవార్డు

ABN, First Publish Date - 2022-11-27T18:50:24+05:30

కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట యునెస్కో అవార్డు (unesco award)కు ఎంపికైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాల నుంచి పలు చారిత్రాత్మక కట్టడాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపిక కాగా భారతదేశంలోని తెలంగాణ (Telangana)లో రెండు చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో అవార్డు దక్కాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమకొండ: కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట యునెస్కో అవార్డు (unesco award)కు ఎంపికైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాల నుంచి పలు చారిత్రాత్మక కట్టడాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపిక కాగా భారతదేశంలోని తెలంగాణ (Telangana)లో రెండు చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో అవార్డు దక్కాయి. ఇందులో ఒకటి కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ కోట కాగా హైదరాబాద్‌ (Hyderabad)లోని కుతుబ్‌షాహి టుంబ్స్‌ కాంప్లెక్‌లోని మెట్లబావిని యునెస్కో అవార్డుకు ఎంపిక చేశారు. 2022 సంవత్సరానికి గాను ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డుకు వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్ట్‌లను యునెస్కో ఎంపిక చేసింది.

దోమకొండ కోట ప్రైవేటు నిర్మాణమైనప్పటికీ సాంస్కృతిక స్థలంగా విజయవంతంగా పునరుద్ధరించిన నేపథ్యంలో యునెస్కో అవార్డుకు ఎంపికైనట్లు దోమకొండ కోట ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు. దోమకొండ కోట 18వ శతాబ్దంలో కామినేని వంశస్థులు నిర్మించారు. సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ కోట నిర్మాణం ఉంది. ఈ కోటలో అద్దాల మెడ, రాజభవనం, అశ్వసాలు, బుర్జులతో పాటు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన శివాలయం ఉంది. ప్రస్తుతం ఈ కోట నిర్వహణ మొత్తం కామినేని అనిల్‌కుమార్‌ చేపడుతున్నారు. కామినేని అనిల్‌కుమార్‌, మెగాస్టర్‌ చిరంజీవికి వియ్యంకుడు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. దోమకొండ కోటలో మెగా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Updated Date - 2022-11-27T18:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising