ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగంపేట మండల కేంద్రాన్ని పర్యాటక కేంద్రాంగా మారుస్తాం

ABN, First Publish Date - 2022-11-26T23:58:25+05:30

లింగంపేట మండల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇక్కడున్న చారిత్రక కట్టడాలను స్వచ్ఛంధ సంస్థల సహకారంతో పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని ఇన్ఫోసిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీషాసాబు అన్నారు.

లింగంపేటలో చారిత్రక కట్టడం నాగన్న బావిని పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట రూరల్‌, నవంబరు 26: లింగంపేట మండల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇక్కడున్న చారిత్రక కట్టడాలను స్వచ్ఛంధ సంస్థల సహకారంతో పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని ఇన్ఫోసిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీషాసాబు అన్నారు. ఆమె శనివారం లింగంపేట మండల కేంద్రంలోని పురాతన చారిత్రక కట్టడం నాగన్న బావిని కలెక్టర్‌ జితీష్‌ వి. పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నూటోక్క లింగాలు ఉన్నాయని చరిత్ర చెబుతుందని, గ్రామంలో నగరేశ్వర ఆలయం వద్ద గాలికి ఊగే ధ్వజ స్తంభం ఉందని వీటన్నింటి గొప్పతనాన్ని తెలియజేసి ఫండింగ్‌ సేకరించి బావిని ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఆమె తెలిపారు. బావి నిర్మాణానికి వాడిన సామగ్రిని వారు సేకరించారు. అనంతరం మండలంలోని ముంబాజిపేటలో గిరిజనుల సాంప్రదాయాలు, వేశధారణను పరిశీలించారు. మండలంలో పండే పంటల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఫౌండర్‌ ఆఫ్‌ద రేన్‌ వాటర్‌ ప్రాజెక్టు జాయింట్‌ సెక్రెటరీ కల్పన, పద్మ, శివప్రసాద్‌, తహసీల్దార్‌ మారుతి, ఎంపీడీవో నారాయణ, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ శ్రీకాంత్‌, ఏపీఎం శ్రీనివాస్‌లతో పాటు అధికారులు ఉన్నారు.

ఓటరు నమోదును పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి: గ్రామస్థాయిలో ఓటరు నమోదును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో శనివారం ఆయన గ్రామస్థాయి ఓటరు నమోదు కేంద్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గల యువతి, యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పకడ్బందీగా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో శ్రీనునాయక్‌, ఎంపీడీవో రాజువీర్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్ధార్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T23:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising