ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రూ. 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-10-27T10:45:18+05:30

రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ప్రలోభాల పర్వం ఒకటి బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్న వ్యవహారం బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ప్రలోభాల పర్వం ఒకటి బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్న వ్యవహారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా, అజీజ్‌నగర్‌లో పోలీసులు దాడులు చేశారు. రూ. 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో సహా రామచంద్ర భారతి, సింహ యాజులు, నందకుమార్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నగదు సిద్ధం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఫామ్ హౌస్‌పై దాడులు చేశామని సీపీ స్టీఫెన్ రవీంధ్ర చెప్పారు. ఫామ్ హౌస్‌లో ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. దీని వెనుక ఎవరున్నారు? అన్న అంశాలపై విచారణ జరుపుతున్నామని సీపీ తెలిపారు.

గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డితో ఫామ్ హౌస్‌లో చర్చలు జరిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రామచంద్ర భారతి సంప్రదింపులు జరిపినట్లు సమాచారముందని సీపీ అన్నారు. పార్టీ ఫిరాయిస్తే నగదుతోపాటు పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోందన్నారు. తిరుపతి నుంచి ఒక స్వామీజీ ఇక్కడకు వచ్చారని సీపీ రవీంధ్ర తెలిపారు. కాగా రాజకీయ పెను ప్రకంపనలు సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సూత్రధారులను పక్కా ప్లానింగ్‌తో పట్టుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచింది.

Updated Date - 2022-10-27T10:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising