ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీలో ముగిసిన జాతీయ బృందం పరిశీలన

ABN, First Publish Date - 2022-12-11T00:27:49+05:30

కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ బృందం పరిశీలన శనివారం ముగిసింది. ఆస్పత్రికి 3లక్షల రివార్డు ఇచ్చేందుకు శుక్ర, శనివారాలు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ బృందం పరిశీలించింది.

సమావేశంలో మాట్లాడుతున్న బృందం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందుర్గు, డిసెంబరు 10: కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ బృందం పరిశీలన శనివారం ముగిసింది. ఆస్పత్రికి 3లక్షల రివార్డు ఇచ్చేందుకు శుక్ర, శనివారాలు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ బృందం పరిశీలించింది. బృందం సభ్యులు డాక్టర్‌ నైనా పటేల్‌, డాక్టర్‌ సౌమ్య రెండో రోజు శనివారం పీహెచ్‌సీ లేబర్‌ రూంను చూసి అందులో ఉండాల్సిన పరికరాలను, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలపై స్టాఫ్‌ నర్సులను అడిగి తెలుసుకున్నారు. డెలివరీలకు వస్తున్న గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో సేవలందించాలని, ప్రసవానంతరం కేసీఆర్‌ కిట్‌ను అందజేయాలని అధికారులు సూచించారు. అనంతరం అరోగ్య కేంద్రం సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో తాము గుర్తించిన లోపాలపై బృందం సభ్యులు సిబ్బందికి తెలియజేసి, వాటిని సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి అమృతజోసఫ్‌, డాక్టర్‌ జయప్రకాశ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు, ప్రభులింగం, వినోద్‌కుమార్‌, ఉదయ్‌, రాజు నాయక్‌, వరలక్ష్మి, పరమేశ్వర్‌, మాధవి, సంధ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-11T00:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising