ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ అందరివాడు

ABN, First Publish Date - 2022-12-06T23:50:59+05:30

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందరివాడని పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీలు, సంఘాల నాయకులు అన్నారు.

తాండూరు : అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాప్రతినిధులు, పార్టీలు, సంఘాల నాయకులు

అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

తాండూరు/తాండూరు రూరల్‌/యాలాల/ధారూరు/నవాబుపేట/ కులకచర్ల/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/దౌల్తాబాద్‌/దోమ/మోమిన్‌పేట్‌/పూడూర్‌/పరిగి రూరల్‌, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందరివాడని పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీలు, సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కొడంగల్‌లో అంబేడ్కర్‌ పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు యస్‌.సోమశేఖర్‌, యు.రమేశ్‌బాబు, కొండయ్య, రమేశ్‌బాబు, మధుసూదన్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్‌ పట్టణంలోని నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ డివి.నరేశ్‌రాజ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సంతోష, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. బొంరా్‌సపేట్‌ మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి, విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్‌గౌడ్‌, పీఆర్టీయూ నాయకులు అనిల్‌కుమార్‌, కాశీపతి, యూటీఎఫ్‌ నాయకులు గోపాల్‌, రాజశేఖర్‌, తపస్‌ నాయకులు చంద్రశేఖర్‌, వెంకటేశం, సీఆర్పీ బావుసింగ్‌, ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, ఎమ్మార్సీ సిబ్బంది గౌస్‌ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం, చిత్రపటాలకు నివాళులర్పించారు. దోమ మండల కేంద్రంతో పాటు మండలం బొంపల్లి, అయినాపూర్‌, దిర్సంపల్లి, పాలేపల్లి తదితర గ్రామాల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ మండలాధ్యక్షుడు మల్లన్న ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. బీఎస్పీ, దళిత, ప్రజా సంఘాల నాయకులు వెంకట్‌, విజయరాజు, నర్సిములు, వెంకటేశ్‌, రామన్న, తదితరులున్నారు. మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సోమారపు రవి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేవీపీఎస్‌ నాయకులు రఫీయోద్దీన్‌, సురేశ్‌, నర్సిములు, నవీన్‌కుమార్‌, విష్ణు, మౌలాలి తదితరులున్నారు. పూడూర్‌ మండలం మంచన్‌పల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పూడూర్‌ మండలాద్యక్షుడు సురేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యు.భాస్కర్‌, నాయకులు లక్ష్మణ్‌, రామచంద్రయ్య, వన్‌పల్లి తదితరులున్నారు. పరిగి పట్టణంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతిని జరుపుకున్నారు. జాఫర్‌పల్లిలో అంబేడ్కర్‌ వర్ధంతిలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే కులకచర్ల, చౌడాపూర్‌ మండల కేంద్రాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు పూల మాలలువేసి నివాళుర్పించారు. ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరికృష్ణ, కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిగిలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, జడ్పీటీసీ హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌రావు, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌కుమార్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ లాల్‌కృష్ణ ప్రసాద్‌, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు యం.వెంకటయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌, అమర్‌నాథ్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివా్‌సనాయక్‌, బీయంపీ జిల్లా అధ్యక్షుడు గట్ట్యేనాయక్‌, జేఏసీ నియోజకవర్గ కన్వీనర్‌ ముకుంద నాగేశ్వర్‌, సుల్తాన్‌పూర్‌లో ఎంపీటీసీ వెంకట్రామ్‌రెడ్డి, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల మండలాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులర్పించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ధారూరు మండలం నాగారంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు నరోత్తంరెడ్డి, నాయకులు ఎం. శ్రీనివాస్‌, సుకుమార్‌, ఎ.శ్రీనివాస్‌, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలువేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ సంఘం నాయకులు బి.శివరాజ్‌, జాన్‌, సర్పంచ్‌లు రత్నం, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ..

ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర/మూడుచింతలపల్లి/మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : డిసెంబరు 6 : అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతఒక్కరు కృషిచేయాలని కొర్రెముల వెంకటే్‌షగౌడ్‌ అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల, ఎదులాబాద్‌, అవుషాపూర్‌, అంకుషాపూర్‌, కాచవానిసింగారం, ప్రతా్‌పసింగారం తదితర గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతిని జరుపుకున్నారు. కొర్రెములలో సర్పంచ్‌ వెంకటేష్‌ గౌడ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎంపీటీసీ వినోద, వార్డుసభ్యులు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేడ్కర్‌ వర్ధంతిని కీసర మండల కేంద్రం కీసర, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా సంఘాల నాయకులు, యువజన సంఘాల నేతలు జరుపుకున్నారు. ఈమేరకు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఎంపీపీ ఇందిరా లక్ష్మీ నారాయణ, మున్సిపల్‌ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీతగౌడ్‌, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, వైస్‌ చైర్మన్లు మల్లే్‌షగౌడ్‌, నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఘట్‌కేసర్‌, అన్నోజిగూడ, రాజీవ్‌ గృహకల్ప కాలనీ, నారపల్లిలో గల అంబేడ్కర్‌ విగ్రహాలకు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగుట్ట సమీపంలో గల చైల్డ్‌ గైడెన్స్‌ సెంటర్‌ను సందర్శించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్య యాదవ్‌.. దివ్యాంగ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, ఆయా పార్టీల నాయకులు, పోచారం మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, సాయిరెడ్డి రాజశేఖర్‌, నర్సింహ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలని శామీర్‌పేట్‌ సీఐ సుధీర్‌కుమార్‌ అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. మూడుచింతలపల్లి, ఉద్ధమర్రి, కేశవపూర్‌, లక్ష్మాపూర్‌, కొల్తుర్‌ గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి సర్పంచ్‌ జామ్‌ రవి, ఎంపీటీసీ నాగరాజు, వార్డుసభ్యులు, ఎసై రఘు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతిని మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయం, గౌడవెల్లిలో ఆయన విగ్రహాలకు, చిత్రపటాల వద్ద పూలమాలలువేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా సంఘాల నాయకులు అంబేడ్కర్‌ గొప్పదనాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

Updated Date - 2022-12-06T23:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising