కమాండెంట్లు చిత్తశుద్ధ్దితో విధులు నిర్వర్తించాలి
ABN, First Publish Date - 2022-12-14T23:37:47+05:30
శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ కమాండెంట్లు అంకితభావం, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ గొప్పపేరును తెచ్చుకోవాలని సీఐఎ్‌సఎఫ్ సౌత్ సెక్టార్ అదనపు డీజీపీ జగ్బీర్‌సింగ్ అన్నారు.
సీఐఎ్‌సఎఫ్ సౌత్ సెక్టార్ అదనపు డీజీపీ జగ్బీర్‌సింగ్
హకీంపేటలోని నిసాలో అసిస్టెంట్ కమాండెంట్ పాస్ ఔట్‌పరేడ్ ప్రొగ్రామ్
శామీర్‌పేట, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి) : శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ కమాండెంట్లు అంకితభావం, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ గొప్పపేరును తెచ్చుకోవాలని సీఐఎ్‌సఎఫ్ సౌత్ సెక్టార్ అదనపు డీజీపీ జగ్బీర్‌సింగ్ అన్నారు. బుధవారం శామీర్‌పేట మండలం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమిలో నిసా డైరక్టర్ జోస్‌మోహన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 21 మంది అసిస్టెంట్ కమాండెంట్ల్లకు పాస్ ఔట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐఎ్‌సఎఫ్ సౌత్ సెక్టార్ అదనపు డీజీపీ జగ్బీర్‌సింగ్ విచ్ఛేసి వారి నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన వారు, శిక్షకులు, సిబ్బంది నిసా ప్రొబేషనర్ల దళంలో సమర్ధవంతమైన సభ్యులుగా కృషి చేశారని ప్రశంసించారు. దేశంలో భద్రత నిచ్చే ప్రాంతాల్లో నిసా ఏసీలు వృత్తిపరంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రశంసలు పొందాలని సూచించారు. నిసా డైరెక్టర్ జోస్‌మోహన్(ఐపీఎస్) మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకొని విధులకు వెళ్తున్న నూతన ఏసీలు కొత్త సవాళ్ళు, బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధ్దంగా ఉండాలని సూచించారు. అనంతరం పాస్‌ఔట్‌పై వెళ్తున్న ఏసీలతో నిసా డీఐజీ శ్రీనివా్‌సబాబు, డిప్యూటీ డైరెక్టర్ ఎన్‌ఎ్‌సఏ ప్రమాణం చేయించారు.
నూతన ఏసీలకు నల్సార్ పీజీ డిప్లామా సర్టిఫికెట్ల ప్రదానం
కాగా నిసాలో శిక్షణ పూర్తి చేసుకున్న 21 మంది అసిస్టెంట్ కమాండెంట్ ప్రొబేషనర్లకు శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి అడ్వాన్స్‌డ్ పోస్టు గ్రాడ్యూయేషన్ ఇన్ డిప్లమా సర్టిఫికెట్లను కూడా నిసా అదనపు డైరెక్టర్ జనరల్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, అధారిత పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లకు చెందిన ప్రముఖులు, సీఐఎ్‌సఎఫ్, ఇతర సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-14T23:37:49+05:30 IST