ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN, First Publish Date - 2022-12-24T23:00:48+05:30

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరు పాటుపడాలని, ఇది అందరి బాధ్యత అని పర్యావరణ వేత్త డాక్టర్‌ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రాంచంద్రాపూర్‌లో ద్వారక పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ పర్యావరణం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్యావరణవేత్త డాక్టర్‌ పురుషోత్తంరెడ్డి

పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమావేశం

కొందుర్గు, డిసెంబరు 24: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరు పాటుపడాలని, ఇది అందరి బాధ్యత అని పర్యావరణ వేత్త డాక్టర్‌ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రాంచంద్రాపూర్‌లో ద్వారక పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ పర్యావరణం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. 1974లో జల కాలుష్యం నిరోధక చట్టం వచ్చిందని, ఈ చట్టం ఆధారంగానే కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ)లను ఏర్పాటు చేశారన్నారు. 1981లో వాయు కాలుష్య నిరోధక చట్టం వచ్చిందని, భోపాల్‌ గ్యాస్‌ సంఘటన అనంతరం 1986లో సమగ్ర పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చిందని వివరించారు. జల, వాయు కాలుష్యాలను నిరోధించేందుకు పట్టిష్ట చట్టాలున్నాయని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పరిశ్రమలను అడ్డుకునే అధికారం ఉందన్నారు. ప్రజలకు సేవచేసే బాధ్యత ప్రజాప్రతినిఽధులదేనని అన్నారు. కాలుష్య నిరోధంలో అన్ని రాజకీయ పార్టీలూ విఫలమయ్యయని, ఉత్తర భారత నగరాలన్నీ వాయు కాలుష్యంతో నిండిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడొద్దని, రైతుల ఐకమత్యంతోనే కాలుష్య కారక ఫ్యాక్టరీల స్థాపనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముల్కనూర్‌లో 300 మంది రైతులు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోగా నేడు అది 7వేల మంది రైతుల సంఘంగా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులను సొసైటీనే ఇప్పిస్తోందన్నారు. పంట ఉత్పత్తుల అమ్మకాలు, గోడౌన్లలో నిల్వకు సహకరిస్తోందన్నారు. కొందుర్గు మండలంలోనూ రైతు సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుకు తాను సహాయసహకారాలు అందజేస్తానని తెలిపారు. సమావేశంలో పులుసుమామిడికి వాసి చిన్నయ్యగౌడ్‌, పర్వతాపూర్‌ వాసి శ్యాంసుందర్‌ మాట్లాడారు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణలో పరిశ్రమ వద్దని తామ్తఆ ముక్తకంఠంతో చెప్పామన్నారు. కార్యక్రమంలో సుభాషన్‌రెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, షాద్‌నగర్‌ బార్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాజే్‌షపటేల్‌, రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు దర్గా సరస్వతి, ఆంజనేయులు, రాంచంద్రయ్య, సర్సింలు, నాయకులు వెంకటేష్‌, రామకృష్ణ, నర్సింలు, దర్గా రాంచంద్రయ్య, గోపాల్‌నాయక్‌, రామస్వామి, రమేశ్వర్‌రెడ్డి, చిన్నయ్యగౌడ్‌, శ్యాంసుందర్‌, భాస్కర్‌, రాములు, రంగయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-24T23:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising