రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2022-11-23T23:31:02+05:30
రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం హెచ్చరించారు.
కేశంపేట, నవంబరు 23: రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం హెచ్చరించారు. రోడ్డుపై వడ్లు ఆరబోయడంతో మంగళవారం సంతాపూర్ గ్రామ శివారులో ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతిచెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై ధాన్యం ఆరబోయటంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన ట్రాఫిక్ సీఐ శ్రీశైలం సంతపూర్ గ్రామానికి చెందిన యాదయ్యపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
రోడ్లపై ఆరబోస్తే కేసులు
రహదారులపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ శ్రీశైలం హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి కిందపడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ధాన్యం ఆరబోతలకు కల్లాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.
Updated Date - 2022-11-23T23:31:04+05:30 IST