కమ్మేసిన పొగమంచు
ABN, First Publish Date - 2022-12-03T23:26:09+05:30
మండలంలోని గ్రామాలను మంచు దుప్పటి కమ్మేసింది. శనివారం ఉదయం 8 గంటలకు వరకు కూడా పొగ మంచు వీడకపోవడంతో హైవేపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
షాబాద్, డిసెంబరు 3 : మండలంలోని గ్రామాలను మంచు దుప్పటి కమ్మేసింది. శనివారం ఉదయం 8 గంటలకు వరకు కూడా పొగ మంచు వీడకపోవడంతో హైవేపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లారు. పంట చేలపై విపరీతంగా మంచు కురవడంతో ఆహ్లాదకరంగా కనిపించాయి. మంచు కారణంగా చలి తీవ్రత పెరిగి ప్రజలు అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి వణికిపోయారు.
Updated Date - 2022-12-03T23:26:10+05:30 IST