అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి
ABN, First Publish Date - 2022-11-25T23:35:55+05:30
అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవాని జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు.
రంగారెడ్డి అర్బన్, నవంబరు 25 : అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవాని జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఓటరు నమోదుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు పరిమితం కాకుండా బూత్ లెవల్ అధికారులు తమ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయించాలని తెలిపారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై దృష్టి సారించాలని సూచించారు. ఓటరు జాబితాకు అనుగుణంగా ఆధార్ సీడింంగ్ పూర్తి చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు, మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత ఫారం 7, ఫారం 8లను పూర్తి చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు ప్రాముఖ్యత గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. వందేళ్లకు పైబడి వయసు కలిగిన ఓటర్ల ఫొటోలతో, వారు క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్న తీరును వివరిస్తూ అన్ని గ్రామాల్లో కొత్త ఓటర్లకు ప్రేరణ కలిగించేలా ప్లెక్సీలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-25T23:35:57+05:30 IST