ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబు జగ్జీవన్‌రామ్‌ నేషనల్‌ అవార్డుకు నర్సింగ్‌రావు ఎంపిక

ABN, First Publish Date - 2022-09-21T05:22:53+05:30

బాబు జగ్జీవన్‌రామ్‌ నేషనల్‌ అవార్డుకు చేవెళ్ల

అవార్డు పత్రాన్ని అందుకుంటున్న నర్సింగ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, సెప్టెంబర్‌ 20 : బాబు జగ్జీవన్‌రామ్‌ నేషనల్‌ అవార్డుకు చేవెళ్ల బాబుజగ్జీవన్‌రామ్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింగ్‌రావు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు సెలక్షన్‌ కమిటీ నేషనల్‌ చైర్మన్‌ బీఎ్‌సఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అవార్డు పత్రాన్ని హైదరాబాద్‌ నగరంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతీ ఏడాది ప్రజాఉద్యమకారులు, సంఘ సేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డు అందజేస్తుందన్నారు. ఈ ఏడాది నవంబర్‌ 13వ తేదీన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే ఆలిండియా బహుజన రైటర్స్‌ మూడో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ నేషనల్‌ అవార్డు అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ అవార్డు లెటర్‌ అందజేసిన వారిలో బీఎస్సీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం. గౌతమ్‌, రాష్ట్ర కో- ఆర్డినేటర్‌ హనుమాన్‌, విష్ణు, అవార్డు సెలెక్షన్‌ కమిటీ సభ్యులు మందాడి సంజీవరావు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-09-21T05:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising