ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు చేవెళ్లలో శ్రీ గాయత్రి విశ్వకర్మ మహాయజ్ఞం

ABN, First Publish Date - 2022-09-17T05:07:34+05:30

చేవెళ్లలోని శ్రీ బ్రహ్మగిరి క్షేత్రంలో నేడు శ్రీగాయత్రీ విశ్వకర్మ

చేవెళ్ల బ్రహ్మగిరి క్షేత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌ / చేవెళ్ల / షాబాద్‌, సెప్టెంబరు 16 : చేవెళ్లలోని శ్రీ బ్రహ్మగిరి క్షేత్రంలో నేడు శ్రీగాయత్రీ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 17న ఉదయం 8.15 గంటలకు ధ్వజారోహణము, అలాగే ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు గణపతి పూజ పుణ్యహవచనము, పంచగవ్య పాలశన, అంకురారోహణము, నవగ్రహ దిక్పాలత పంచబ్రహ్మల పూజ జరుగును. అనంతరం శ్రీగాయత్రీ విశ్వకర్మ పూజ, అగ్ని ప్రతిష్ఠ, గాయత్రీ విశ్వకర్మ హోమము, పూర్ణాహుతి, మహా నైవేద్యము, మంగళహారతి, మంత్ర పుష్ఫము, తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రముఖుల సందేశాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి భోజన విరామము. సాయంత్రం 4గంటల నుంచి విశ్మకర్మ భగవానుని ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాలని మండల విశ్వకర్మ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. శ్రీనివాసచారి, వి. శ్రీనివాసచారి, ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వి. లింగాచారి, ఎ. మాణిక్యచారి కోరారు. అదేవిధంగా షాబాద్‌లో కాళీమాత ఆయాలంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నట్లు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మధుసూదన్‌చారి తెలిపారు.



Updated Date - 2022-09-17T05:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising