కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2022-11-08T23:40:49+05:30

మాస్టర్‌ జపాన్‌ షాటోకాన్‌ కరాటే పోటీల్లో చేవెళ్లకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు.

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
చౌదరిగూడ: విద్యార్థులకు షీల్డ్‌లు అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల/చౌదరిగూడ, నవంబరు 8: మాస్టర్‌ జపాన్‌ షాటోకాన్‌ కరాటే పోటీల్లో చేవెళ్లకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈమేరకు వికారాబాద్‌లో జరిగిన కాటా, కుమితే కరాటే పోటీల్లో నికేత్‌(బ్లాక్‌ బెల్ట్‌) రజత పతకం సాధించాడు. బ్రౌన్‌ బెల్ట్‌ హోల్డర్‌ జాశ్వర్‌ కాటా కుమితే, కాంచర్‌, బోస్ట్రాప్‌ నాలుగు కేటగిరిల్లోనూ స్వర్ణపతకాలు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా చరణ్‌ బంగారు, రజతం పతకాలు, కిరణ్‌, సాయి (బ్లూ బెల్ట్‌) కాటా, కుమితే రెండింటిలోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. అఖిల్‌(ఆరెంట్‌ బెల్ట్‌) కాటా కుమితేలో క్యాంస పతకం సాధించాడు. ఎల్లో బెల్ట్‌ హోల్డరైన ఎంఎ్‌స.రహేన్‌ అలీ బంగారు, క్యాంస్య పతకాలు గెలుచుకున్నాడు. అదేవిధంగా మోహ్రీన్‌కు కాటా, కుమితే రెండు కేటగిరిల్లోనూ బంగారుపతకం, కుమితేలో కాంస్యపతకం వచ్చింది. కార్తిక్‌ అనాజ్‌, సాయిచరణ్‌లకు సిల్వర్‌, మాధన్‌కు కాంస్య పతకం వరించిందని చేవెళ్ల ఏరియా కరాటే శిక్షకులు మాస్టర్‌ మహ్మద్‌ సోహెల్‌, రాజు వివరించారు. అదేవిధంగా జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల ఉన్నత పాఠశాలలో బ్రూస్లీ, కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ పస్ట్‌ డోజో కరాటే పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అర్చనగౌడ్‌, శివాజీలు గ్రాండ్‌ ఛాంపియన్‌షి్‌పలో మొదటిస్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరిని అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, మల్లేష్‌, ఎస్‌ఏంసీ చైర్మన్‌ బాల్‌రాజ్‌, కృష్ణ, అక్రం సలీం, గౌస్‌, మాస్టర్‌లు నందు, రమే్‌షహాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T23:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising