ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి వరకు మన ఊరు- మనబడి పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-10-29T22:42:55+05:30

మన ఊరు - మన బడి కింద చేపట్టిన పనులను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ , ఇరిగేషన్‌ ఈఈలు, డీఈలు, ఏఈలతో మనఊరు-మనబడి పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షాసమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, అక్టోబరు 29 : మన ఊరు - మన బడి కింద చేపట్టిన పనులను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ , ఇరిగేషన్‌ ఈఈలు, డీఈలు, ఏఈలతో మనఊరు-మనబడి పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మనఊరు- మనబడి పనులను ఈనెల 31 వరకు పూర్తి చేసి పెయింటింగ్‌ పనులకు సిద్ధం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులను తక్షణమేగ్రౌండ్‌ చేసి కిచెన్‌ షెడ్స్‌, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలన్నారు. అట్టి పనుల ఫోటోలు తీసి తన వాట్సా్‌పకు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పనులను నవంబర్‌ 15 వరకు పూర్తి చేయాలని సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలుతప్పవని హెచ్చరించారు. అవసరమైన సిమెంట్‌ఇసుక అందించడం జరుగుతుందని ఇందుకు గాను తాండూరు బషీరాబాద్‌, పెద్దేముల్‌ తహసీల్దార్లను ఎప్పటికప్పుడు సంప్రందించాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకు వెంటనే ఎస్టిమేట్లు, ఎఫ్‌టీవోలు ఆప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఏమైనా టెక్నికల్‌ సమస్యలు ఉంటే ఇక్కడే పరిష్కరించుకొని వెళ్లాలన్నారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంఈవోలు క్షేత్రస్థాయిలో ఇట్టి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులుప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌(తొలిమెట్టు) కార్యక్రమం కింద 5వ తరగతి స్థాయి వరకు గల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక తరగతులు నిర్వహించి చదవడం, రాయడంతో పాటు వారి పరిజ్ఞానం మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయి విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో విద్యార్థులకు ఉత్తమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇక నుంచి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యలో ప్రతివిద్యార్థి పురోగతిని పరిశీలించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, వివిధ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-29T22:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising