ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళిసైతో ముగిసిన సబిత భేటీ.. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని తెలిపిన మంత్రి

ABN, First Publish Date - 2022-11-10T18:35:21+05:30

గవర్నర్‌ తమిళిసై (Tamilisai)తో మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్‌ తమిళిసై (Tamilisai)తో మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్లు (Reservations) వంటి వాటిపై గవర్నర్ వివరాలు అడిగారు. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని మంత్రి, అధికారులు తెలిపారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యాన్ని.. గవర్నర్‌ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. నియామకాలు త్వరగా జరిగేందుకు, సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని విషయాలపై గవర్నర్‌కు సబిత నివేదిక అందించారు.

యూనివర్సిటీ (University)ల బిల్లుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సమయం ఇస్తే.. వచ్చి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు గవర్నర్‌ కార్యాలయాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. గవర్నర్‌ కార్యాలయ అధికారులతో ఫోన్‌ ద్వారా గవర్నర్‌ సమయాన్ని కోరారు. గవర్నర్‌ సమయం ఇస్తే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాను, ఇతర అధికారులు వచ్చి యూనివర్సిటీల నియామక బిల్లుపై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ నుంచి కబురు రావడంతో గురువారం సాయంత్రం గవర్నర్‌తో మంత్రి సబిత భేటీ అయ్యారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై సందేహాలు నివృత్తి చేయడానికి విద్యాశాఖ మంత్రి రావాలంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ రాయడం తెలిసిందే.

Updated Date - 2022-11-10T18:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising